News March 30, 2024
తూ.గో: వేసవి ప్రారంభంలోనే భానుడి భగభగలు
ఉమ్మడి తూ.గో జిల్లాలో వేసవికాలం ప్రారంభంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి ఆఖరు నాటికే సుమారు 35-38 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. రోజురోజుకు ఎండ తీవ్రమై ప్రయాణికులు, పనులకు వెళ్లిన వారు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ముగిసే నాటికి సాధారణ ఉష్ణోగ్రతల కంటే దాదాపు 3 డిగ్రీల వరకూ అధికంగా నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
Similar News
News January 18, 2025
రాజమండ్రి: పీఎం ఇంటర్న్ షిప్ గోడపత్రికలు ఆవిష్కరణ
ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ ద్వారా రాబోయే ఐదేళ్లలో దేశంలోని టాప్ 500 కంపెనీలలో కోటి మంది యువతకు నైపుణ్యంతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. శనివారం రాజమండ్రి కలెక్టర్ ఛాంబర్‌లో పీఎం ఇంటర్న్ షిప్ పథకం గోడ ప్రతులను జిల్లా పరిశ్రమల అధికారి రామన్, సహాయ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, నైపుణ్య అభివృద్ధి అధికారి పెరుమాళ్ళరావుతో ఆవిష్కరించారు.
News January 18, 2025
కోరుకొండ నారసింహుని ఆలయంలో మద్యం, మాంసం
ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం దత్తత ఆలయమైన కోరుకొండ నారసింహుని ఆలయం ప్రాంగణంలో మద్యం బాటిళ్లు దర్శనం ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఆలయ పవిత్రతను దెబ్బతీసే ఇటువంటి చర్యలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ వ్యవహారం బయట వారి పనా.. లేక ఆఫీస్ సిబ్బంది పనా అంటూ ఉన్నతాధికారులు నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు.
News January 18, 2025
తూ.గో జిల్లాకు చివరి ర్యాంక్
ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో తూ.గో జిల్లా మంత్రులు, ఎంపీలు, పార్టీ జోనల్ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో వారి పనితీరు, పథకాల అమలు తదితర అంశాలపై ర్యాంకులు ఇచ్చినట్లు సమాచారం. అందులో ఉమ్మడి తూ.గో జిల్లా మంత్రులు, ఎంపీల పనితీరుకు చివరి ర్యాంకు ఇచ్చినట్లు తెలుస్తోంది. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం.