News April 17, 2024
తూ.గో: వైసీపీకి ఇద్దరు ప్రముఖుల రాజీనామా
కమ్మ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పదవికి, వైసీపీ పార్టీ సభ్యత్వానికి కొటారు అశోక్ బాబా, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుడు లంకసాని శ్రీనివాసరావు బుధవారం రాజీనామా చేశారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఇద్దరు నాయకులు త్వరలో టీడీపీలో చేరతామని వెల్లడించారు.
Similar News
News September 15, 2024
తలుపులమ్మ సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి దంపతులు
తుని మండలంలోని లోవలో ఉన్న తలుపులమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి దంపతులు దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వీరికి దేవస్థానం ఈఓపి విశ్వనాథరాజు, వేద పండితులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, వస్త్రాలు వారికి అందజేశారు.
News September 14, 2024
రాజానగరంలో తీవ్ర విషాదం
రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. టీ పొడి అనుకుని పొరపాటున వృద్ధ దంపతులు పురుగు మందు వేసుకొని టీ తాగారు. ఈ ప్రమాదంలో వెలుచూరి గోవింద్(75), అప్పాయమ్మ (70) మృతి చెందారు. అప్పాయమ్మకు కంటి చూపు తక్కువగా ఉండడంతో పొలాలకు చల్లే గుళికల ప్యాకెట్‌ను టీ ప్యాకెట్‌గా భావించి టీ పెట్టుకొని తాగారు. కొద్దిసేపటికే నోటి నుంచి నురగలు రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
News September 14, 2024
కాకినాడ: యాంకర్ శ్యామలకు వైసీపీలో కీలకపదవి
వైసీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రముఖ యాంకర్ శ్యామల నియమితులయ్యారు. కాకినాడలోని ఇంద్రపాలేనికి చెందిన శ్యామల సీరియల్ నటిగా, యాంకర్‌గా పేరు సంపాదించుకున్నారు. పలు సినిమాల్లోనూ నటించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ జిల్లాలో వైసీపీ తరఫున విస్తృత ప్రచారం చేశారు.