News April 19, 2024
తూ.గో.: వైసీపీ ఎంపీటీసీ దారుణ హత్య

తూ.గో. జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధి ఎటపాక మండలం కన్నాయిగూడెం ఎంపీటీసీ వర్ష బాలకృష్ణ గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి ఓ వివాహ కార్యక్రమం చూసుకుని వస్తుండగా, కన్నయ్య గూడెం ఊరి శివారులో ఇద్దరు దారి కాచి బండరాయితో మోది హత్య చేశారు. హత్యానంతరం ఇద్దరు నిందితులు ఎటపాక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 27, 2026
కల్తీ పాలు, కలుషిత జలాల ఘటనలపై CM సమీక్ష

CM చంద్రబాబు గురువారం అమరావతి నుంచి తూ.గో, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కల్తీ పాలు, కలుషిత జలాల పరిస్థితిపై క్షేత్రస్థాయి సమీక్ష జరిపారు. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, MLA తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన అంశాల్లో నిర్లక్ష్యం వహించవద్దని CM స్పష్టం చేశారు.

News February 26, 2026
కోర్టు కేసులతో విసిగిపోయారా? ఇదే మంచి ఛాన్స్!

ఉమ్మడి తూ.గో జిల్లా వ్యాప్తంగా మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జాతీయ న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత గురువారం తెలిపారు. రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ వంటి కేసులను ఈ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ ద్వారా త్వరితగతిన ముగించుకోవాలని ఆమె సూచించారు.