News December 26, 2024
తూ.గో: సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లేది ఎలా..?
సంక్రాంతికి స్వగ్రామాలకు వచ్చే వారికి టిక్కెట్ల ధరలు గుబులు పుట్టిస్తున్నాయి. రైలు, బస్సు టికెట్లు ధరలు చూసి షాక్ అవుతున్నారు. హైదరాబాదు నుంచి రాజమండ్రి, సామర్లకోటకు 17 రైళ్లు నడుస్తున్నాయి. వాటిలో ఒక్క టిక్కెట్ కూడా దొరకని పరిస్థితి. కాకినాడ, రాజమండ్రి, అమలాపురానికి ప్రైవేట్ ఏసీ స్లీపర్ ఛార్జీ రూ.1,100 ఉండగా దాన్ని రూ.4 వేలకు పెంచారు. ప్రస్తుతం 50 బస్సులు ఉండగా, వాటిని 70కి పెంచినా ధర తగ్గలేదు.
Similar News
News January 18, 2025
తూ.గో జిల్లాకు చివరి ర్యాంక్
ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో తూ.గో జిల్లా మంత్రులు, ఎంపీలు, పార్టీ జోనల్ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో వారి పనితీరు, పథకాల అమలు తదితర అంశాలపై ర్యాంకులు ఇచ్చినట్లు సమాచారం. అందులో ఉమ్మడి తూ.గో జిల్లా మంత్రులు, ఎంపీల పనితీరుకు చివరి ర్యాంకు ఇచ్చినట్లు తెలుస్తోంది. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం.
News January 17, 2025
తూ.గో : బరువెక్కిన గుండెతో పయనం
తూ.గో జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు సంక్రాంతి పండుగ ముగించుకుని పట్టణాలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా పండుగ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. అప్పుడే పండుగ ముగిసిందా అన్నట్లుగా ఉద్యోగ, వ్యాపారాల రీత్యా పట్టణాలకు వెళ్తున్నారు. ఈసంక్రాంతి సంబరాలను రాబోయే పండగ వరకు నెమరువేసుకుంటూ సంతోషిస్తామని పలువురు ప్రయాణికులు తెలిపారు. పిండి వంటలతో పట్టణాలకు పయనమయ్యేవారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిశాయి.
News January 16, 2025
అసలు ఎవరీ రత్తయ్య..?
సంక్రాంతి నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో వేలల్లో పందేలు జరిగాయి. వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఈసారి తాడేపల్లిగూడెంలో ఏకంగా రూ.1.25 కోట్ల పందెం జరిగింది. కోడిపందేల్లో పేరు మోసిన రత్తయ్య పుంజు, గుడివాడ ప్రభాకర్ పుంజు మధ్య రసవత్తరంగా పందెం జరిగింది. ఎంతో పేరు మోసిన రత్తయ్య పుంజు ఓడిపోవడంతో అందరూ ఖంగుతిన్నారు. అసలు ఎవరీ రత్తయ్య అని ఆరా తీయగా.. ఆయనది లింగపాలెం మండలం రంగాపురం అని తేలింది.