News January 6, 2025

తూ.గో: సంక్రాంతి ట్రైన్లు.. 8 గంటలకు బుకింగ్

image

➤కాకినాడ టౌన్-చర్లపల్లి(07038): 14వ తేదీ
➤సికింద్రాబాద్-కాకినాడ(07078): 12, 19
➤చర్లపల్లి-కాకినాడ(07031): 8, 10, 14, 16, 18
➤కాకినాడ-చర్లపల్లి(07032): 9, 11, 13, 15
➤నాందేడ్-కాకినాడ(07487): 6, 13
➤కాకినాడ-నాందేడ్(07488): 7,14 తేదీల్లో
పై ట్రైన్ల బుకింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతాయి. గెట్ రెడీ.

Similar News

News January 9, 2025

కొత్తపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

కొత్తపేట మండలం పలివెల వంతెన వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నడిచివెళ్తున్న వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో పలివెల గ్రామానికి చెందిన పెండ్రాల చెన్నయ్య (35) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 9, 2025

తూ.గో జిల్లా మీదుగా నడిచే 4రైళ్లు రద్దు

image

విజయవాడ డివిజన్ పరిధిలోని సాంకేతిక మరమ్మతుల కారణంగా ఈ నెల 11, 12న జిల్లా మీదుగా నడిచే 4రైళ్లను రద్దు చేస్తూ డివిజనల్ రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 11న కాకినాడ పోర్టు- వైజాగ్, వైజాగ్- కాకినాడ పోర్టు (17267/17268), 12న గుంటూరు- వైజాగ్(17239), వైజాగ్- గుంటూరు(17240) రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.

News January 8, 2025

ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించాలి: కలెక్టర్

image

ఫ్రీ ఓల్డ్ భూములు డేటా ఎంట్రీ, రెవెన్యూ సదస్సులలో అందిన భూసంబంధిత ఫిర్యాదులు పరిష్కారం, రీసర్వే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ మహేష్ కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్ జయలక్ష్మి అమరావతి నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, జేసీ నిశాంతి పాల్గొన్నారు.