News August 12, 2024

తూ.గో.: సినిమాచెట్టు పునరుద్ధరణకు పనులు ముమ్మరం

image

దేవరపల్లి మండలం కుమారదేవం సినిమాచెట్టు పునరుద్ధరణ పనులను ముమ్మరం చేశామని రోటరీ క్లబ్‌ఆఫ్ రాజమండ్రి ఐకాన్ అధ్యక్షుడు వెంకట్ తెలిపారు. చెట్టు పునరుద్ధరణ కార్యక్రమ ఇన్‌ఛార్జి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. చెట్టు కొమ్మలను కత్తిరించే ప్రక్రియ మొదలుపెట్టామన్నారు. మానుకి ఏ విధమైన నష్టం జరగకుండా ప్రత్యేకంగా తయారుచేసిన లేపనాలు పూసి కవర్ చేస్తామన్నారు.

Similar News

News September 12, 2024

అంబాజీపేట: దారికాచి దోపిడి చేస్తున్న హిజ్రాలు.. కేసు నమోదు

image

దారికాచి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు హిజ్రాలపై కేసు నమోదు చేశామని ఎస్ఐ చిరంజీవి బుధవారం తెలిపారు. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు చేనేత కాలనీకి చెందిన రాజేంద్రప్రసాద్ అమలాపురం నుంచి వస్తుండగా చింతాలమ్మ ఆలయం వద్ద ఇద్దరు హిజ్రాలు డబ్బుల కోసం ఆపారన్నారు. డబ్బులు లేవని చెప్పగా జేబులో నుంచి రూ.4వేలు లాక్కొని మరో వ్యక్తి సాయంతో పారిపోయారన్నారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.

News September 11, 2024

హెక్టార్‌కు రూ.25 వేలు ఇస్తాం: చంద్రబాబు

image

వరదల వల్ల నష్టపోయిన పంట పొలాలకు హెక్టార్‌కు రూ. 25 వేలు చొప్పున పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. కాకినాడ జిల్లా రాజుపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరదలతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 65 వేల ఎకరాల్లో పొలాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఏలేరు రిజర్వాయర్‌కు అధికంగా వరద రావడంతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయని చెప్పారు.

News September 11, 2024

దేవరపల్లి యాక్సిడెంట్.. CM తీవ్ర దిగ్భ్రాంతి

image

తూ.గో. జిల్లా దేవరపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోవడం తనను కలిచివేసిందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.