News August 5, 2024
తూ.గో: ‘సినిమా చెట్టు’ను నాటిందెవరో తెలుసా..?

కుమారదేవంలోని ‘సినిమా చెట్టు’ ఇకనుంచి ఓ చరిత్ర. కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో ఈ నిద్ర గన్నేరు చెట్టును గోదావరి ఒడ్డున సింగలూరి తాతబ్బాయి నాటినట్లు స్థానికులు చెబుతుంటారు. 150 ఏళ్లుగా ఎన్నో వరదలు, తుఫాన్లను తట్టుకుంటూ.. తరతరాల్ని చూసుకుంటూ పెరిగి మహా వృక్షమైంది. షూటింగ్స్ ఎక్కువగా జరగడం వల్ల ‘నిద్ర గన్నేరు’ అనే అసలు పేరును కూడా మర్చిపోయి ‘సినిమా చెట్టు’ అని పిలుస్తారు అక్కడి జనాలు.
Similar News
News February 23, 2026
భయపడకండి.. ప్రభుత్వం అండగా ఉంది: మంత్రి దుర్గేశ్

రాజమండ్రిలో ప్రజలను కలవరపెడుతున్న అనూరియాపై మంత్రి కందుల దుర్గేశ్ తీవ్రంగా స్పందించారు. ఈ పరిస్థితిపై సోమవారం కలెక్టర్ కీర్తి చేకూరి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టిందని, ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఆయన భరోసా ఇచ్చారు.
News February 23, 2026
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై YS షర్మిల సీరియస్!

రాజమండ్రిలో కల్తీ పాల వల్ల నలుగురు మృతి చెందడంపై సోమవారం పీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ పాల సరఫరా వెనుక ఉన్న వాస్తవాలను బయటకు తీయాలని కోరారు. ఈ ఘటన తీవ్ర భయాందోళనలకు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు.
News February 23, 2026
తూ.గో: 58 కేంద్రాలు @ 43,108 మంది విద్యార్థులు

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని 58 కేంద్రాల్లో 43,108 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుండగా, అరగంట ముందు వెళ్లే నిబంధనను రద్దు చేశారు. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత, నిఘా ఏర్పాటు చేశారు.


