News August 2, 2024
తూ.గో.: సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించం: మాజీ ఎంపీ

వర్గీకరణపై సుప్రీం తీర్పును అంగీకరించబోమని అమలాపురం మాజీ MP హర్షకుమార్ పేర్కొన్నారు. టీడీపీ కృష్ణ మాదిగను పావులా వాడుకుందన్నారు. రాజమండ్రిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. 351 ఆర్టికల్ షెడ్యూల్ కులాలకు ఉద్దేశించబడినదని చెప్పారు. వర్గీకరణ చేసేందుకు పార్లమెంట్‌కు కూడా అధికారం లేదన్నారు. ఇది మోదీ, చంద్రబాబు కలిసి ఆడిన కుట్రగా అభివర్ణించారు.
Similar News
News February 25, 2026
డెల్టా రైతులకు గుడ్ న్యూస్.. మీ ఉత్పత్తులకు మార్కెట్ సిద్ధం!

ప్రకృతి వ్యవసాయంపై కొనుగోలుదారులు, విక్రేతల అనుసంధాన సమావేశం రాజమండ్రిలో బుధవారం ఘనంగా జరిగింది. తూ.గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మార్గదర్శకత్వంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డెల్టా ప్రాంత రైతులు, ప్రాసెసర్లు, రిటైలర్లు పరస్పరం అనుసంధానమవడానికి ఈ సమావేశం చక్కని వేదికగా నిలిచింది. ప్రకృతి ఉత్పత్తుల మార్కెటింగ్, విక్రయాల పెంపునకు పలువురు కీలక సూచనలు చేశారు.
News February 25, 2026
గోకవరం: ఏడో తరగతి బాలికను వేధించిన యువకుడి అరెస్ట్

గోకవరం మండలంలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలికను వేధించిన కాళ్ల రాకేశ్ అనే యువకుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడు నిత్యం వేధిస్తున్నాడని బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో గోకవరం SI పవన్ కుమార్ కేసు నమోదు చేశారు. నిందితుడిని రాజంమహేంద్రవరం కోర్టులో హాజరుపరిచినట్లు SI తెలిపారు.
News February 24, 2026
రాజమండ్రి కల్తీ పాల ఘటన.. ఏడుగురి పరిస్థితి విషమం

రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై ఆరోగ్య శాఖ కమిషనర్ వీర పాండియన్ మంగళవారం కీలక వివరాలు వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు మరణించగా, మరో 15 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కొందరిని వెంటిలేటర్, డయాలసిస్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.


