News January 23, 2025

తూ.గో: స్పా సెంటర్ పై పోలీసులు దాడి

image

వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు రాజమండ్రి జేఎన్ రోడ్డులో న్యూ ట్రెండ్జ్ బ్యూటీ మ్యూజిక్ స్పా సెంటర్ పై బుదవారం రాత్రి ప్రకాష్ నగర్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఆరుగురు మహిళలు, ముగ్గురు విటులను స్టేషనుకు తరలించారు. స్పా నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బాజీలాల్ తెలిపారు. వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News February 28, 2026

ఈనెల 28 నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ పంపిణీ: ఎంపీ

image

మహిళల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ (సెర్వికల్‌ క్యాన్సర్‌) నివారణకు ఈనెల 28 నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుందని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. బాలికలు, యువతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ ముప్పును ముందస్తుగా అరికట్టేందుకు తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించాలని ఆమె కోరారు.

News February 27, 2026

తూ.గో: కల్తీ పాల ఘటనపై హెల్త్ బులెటిన్ విడుదల

image

కల్తీ పాల ఘటనలో రాజమండ్రిలోని వివిధ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న 15 మందిలో 11 మంది బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి వైద్య ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నలుగురు రోగుల పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు వెల్లడించింది. కాగా 11 మంది రోగులకు ఇప్పటికీ వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ ఘటనలో 5గురు మృతి చెందిన సంగతి తెలిసిందే.