News January 23, 2025
తూ.గో: స్పా సెంటర్ పై పోలీసులు దాడి

వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు రాజమండ్రి జేఎన్ రోడ్డులో న్యూ ట్రెండ్జ్ బ్యూటీ మ్యూజిక్ స్పా సెంటర్ పై బుదవారం రాత్రి ప్రకాష్ నగర్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఆరుగురు మహిళలు, ముగ్గురు విటులను స్టేషనుకు తరలించారు. స్పా నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బాజీలాల్ తెలిపారు. వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News February 12, 2025
రాజమండ్రి: టెన్త్ అర్హతతో 38 ఉద్యోగాలు

రాజమండ్రి డివిజన్‌లో 38 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News February 12, 2025
రాజమండ్రి: బ్యాంకర్లు కీలకపాత్ర వహించాలి: కలెక్టర్

అల్పాదాయ వర్గాలకు, రైతులకు, మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు రుణాలు మంజూరు, యూనిట్స్ గ్రౌండింగ్ ప్రక్రియలో బ్యాంకర్లు కీలకపాత్ర వహించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద బ్యాంక్ రీజినల్, పశుసంవర్ధక శాఖ తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రతి బ్యాంకర్లు వారి బ్యాంకు తరపున ఒక నోడల్ అధికారిని నియమించి సమాచారాన్ని అందచేయాలన్నారు.
News February 11, 2025
పెరవలి: బర్డ్ ఫ్లూ.. ఇంటింటి సర్వే

తూ.గో జిల్లా పెరవలి మండలం కానూరు పరిధిలో కోళ్ల ఫామ్‌లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో 10KMలలోపు ఇంటింటి సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. అదేవిధంగా చికెన్ షాపులను కొన్ని రోజులు మూసివేయడంతో పాటు, అక్కడ పని వాళ్లకూ వైద్య పరీక్షించాలన్నారు. ప్రజలకు ఏమైనా లక్షణాలు కనిపిస్తే కంట్రోల్ రూమ్ నంబరు 9542908025కు సమాచారం అందించాలన్నారు.