News September 21, 2024

తూ.గో: హత్యాయత్నం కేసు.. భర్తకు మూడేళ్ల జైలు శిక్ష

image

అదనపు కట్నం కోసం భార్యని వేధించడంతో పాటు ఆమెపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ఏలూరుకు చెందిన సంస్కృతం లెక్చరర్ రాజేశ్వరరావుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 వేలు జరిమానా విధిస్తూ పిఠాపురం అసిస్టెంట్ సెషన్స్ జడ్జి బాబు శుక్రవారం తీర్పు చెప్పారు. తొండంగి మండలం బెండపూడికి చెందిన జువాలజీ లెక్చరర్ మధురాక్షిపై ఆమె భర్త 2020 సెప్టెంబర్ 10న తునిలో కత్తితో దాడి చేసి, హత్య చేసేందుకు యత్నించాడు.

Similar News

News September 21, 2024

తూ.గో మీదుగా నడిచే రైళ్లు రద్దు

image

ఈ నెల 29 నుంచి అక్టోబర్ 1 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం తెలిపింది. కడియం-కొవ్వూరు స్టేషన్ల మధ్య పనులతో ఈ నెల 29న తిరుపతి-విశాఖ, 30న విశాఖ-తిరుపతి, విజయవాడ-విశాఖ, విశాఖ-విజయవాడ, విశాఖ-గుంటూరు, గుంటూరు-విశాఖ, 29, 30 తేదీల్లో గుంటూరు-విశాఖ, విజయవాడ-రాజమండ్రి, అక్టోబర్ 1న విశాఖ-గుంటూరు, 30న విజయవాడ-రాజమండ్రి, రాజమండ్రి విశాఖ, విశాఖ-రాజమండ్రి రైళ్లను రద్దు చేశారు.

News September 21, 2024

23న కాకినాడలో జాబ్ మేళా

image

ఈ నెల 23వ తేదీన కాకినాడ వికాస కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు తెలిపారు. ఈ మేళాలో ఐఅండ్‌వీ బయో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి జరిగే ఈ జాబ్‌మేళాకు పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు.

News September 20, 2024

మాజీ సీఎం జగన్ కలిసిన ముద్రగడ

image

మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డితో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట తనయుడు ముద్రగడ గిరిబాబు, కిర్లంపూడి మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు తదితరులు ఉన్నారు.