News February 26, 2026
తూ.గో: 12 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం

రాజానగరం మండలంలో 12 ఏళ్ల బాలికపై 44 ఏళ్ల కాళీకృష్ణ అత్యాచారయత్నం చేశాడని ఎస్ఐ మురళికృష్ణ గురువారం తెలిపారు. అనారోగ్యం వల్ల స్కూల్‌కు వెళ్లని బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా ఈ దారుణానికి ఒడిగట్టాడని వెల్లడించారు. కూలి పని నుంచి వచ్చిన తల్లి, స్థానికులు బాలిక అరుపులు విని రావడంతో నిందితుడు పరారయ్యాడన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Similar News
News April 19, 2026
అనకాపల్లి: రహదారిపై బస్సు బోల్తా.. పలువురికి గాయాలు..!

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి చెన్నై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రహదారిపై బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 19, 2026
గ్రేటర్ జోన్‌లో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్

గ్రేటర్ జోన్‌లో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. గత రెండు రోజులుగా అత్యధికంగా 99 నుంచి 100 మిలియన్ యూనిట్లు నమోదవుతోంది. సాధారణంగా వేసవి తీవ్రత పెరిగే మే నెలలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుతుంది. ఈ సారి ఉష్ణోగ్రతలు ముందుగానే పెరగడం, వాణిజ్య, గృహ వినియోగం అధికం కావడం వల్ల మార్చి ప్రారంభంలోనే రికార్డు స్థాయి డిమాండ్ నమోదైంది.