News February 7, 2025
తూ.గో: 13 మద్యం షాపులకు 17 దరఖాస్తులు

జిల్లాలో కల్లుగీత వృత్తులకు కేటాయించిన 13 మద్యం షాపుల దరఖాస్తులకు 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు పొడిగించామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి చింతాడ లావణ్య తెలిపారు. ఇప్పటివరకు 13 మద్యం షాపులకు 17 దరఖాస్తులు మాత్రమే వచ్చాయన్నారు. 9న దరఖాస్తులు పరిశీలన, 10న రాజమండ్రి ఆర్‌డీవో కార్యాలయంలో షాపులు కేటాయింపునకు సంబంధించి డ్రా తీసి అదేరోజు షాపులు కేటాయిస్తామన్నారు.
Similar News
News February 22, 2026
అనూరియా వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దుర్గేశ్

తూ.గో. జిల్లాలో అనూరియా(మూత్రపిండాల వ్యాధి) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆదివారం సూచించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేశ్ అధికారులు, వైద్య వర్గాలతో కలిసి తాజా పరిస్థితులను ఆదివారం ఫోన్ ద్వారా సమీక్షించినట్లు ఆయన తెలిపారు. అనూరియా వ్యాప్తి నివారణ కోసం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు.
News February 22, 2026
రాజమండ్రి: అనూరియా కేసులపై ఎంపీ పురందేశ్వరి సమీక్ష

రాజమండ్రిలో నమోదైన అనూరియా కేసులపై ఎంపీ పురంధరేశ్వరి ఆదివారం కలెక్టర్ కీర్తి చేకూరి, డీఎంహెచ్వోలతో ఫోన్‌లో సమీక్షించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆమె, వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. కల్తీ అనుమానాల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీలు నిర్వహించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజారోగ్యం విషయంలో ఎటువంటి అలసత్వం వహించవద్దని స్పష్టం చేశారు.
News February 22, 2026
రాజమండ్రి: అనూరియా కేసులపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం

తూ.గో. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు రాజమండ్రిలో అనూరియా కేసుల క్లస్టర్‌పై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కే.వెంకటేశ్వరరావు వివరాలు ప్రకారం రాజమండ్రికి చెందిన నలుగురు వ్యక్తులు అనూరియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. జిల్లా సర్వైలెన్స్ అధికారికి సమాచారం అందించి విచారణ ప్రారంభించామన్నారు.


