News August 3, 2024

తూ.గో.: 16లోపు అప్రెంటిస్‌ షిప్‌ దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్రెంటిస్‌ షిప్‌ కోసం ఈ నెల 16వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చునని జిల్లా ప్రజా రవాణా అధికారి షర్మిల అశోక తెలిపారు. డీజిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, మోటార్‌ మెకానిక్‌, వెల్డర్‌ ట్రేడ్‌లకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. రిజిస్ట్రేషన్‌ ఫారంతో పాటు టెన్త్, ఐటీఐ మార్కుల జాబితా, ఆధార్‌ తదితర ధ్రువీకరణ పత్రాలు జత చేయాలన్నారు.

Similar News

News November 9, 2025

సబ్సిడీ వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం: ఈడీ

image

తూ.గో జిల్లాలోని సఫాయి కర్మచారి నిరుద్యోగ యువతకు NSKFDC పథకంలో భాగంగా సబ్సిడీపై సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు మంజూరు చేస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె.సత్యవతి తెలిపారు. అర్హులైన వారు కాకినాడలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు 62818-17023 నంబరును సంప్రదించాలని ఆమె సూచించారు.

News November 9, 2025

తుఫాన్ నష్టం అంచనాకు 10న కేంద్ర బృందం

image

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు ఈనెల 10, 11 తేదీల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమిబసు నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం, నష్టం, పునరావాస చర్యలపై కేంద్రానికి నివేదిక ఇస్తుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు.

News November 8, 2025

తాళ్లపూడి: యాసిడ్ పడి ఇద్దరికి గాయాలు

image

తాళ్లపూడి మండలం పైడిమెట్టలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గోతులమయమైన రహదారిపై వెళ్తున్న యాసిడ్ ట్యాంకర్ నుంచి కుదుపులకు యాసిడ్ లీకైంది. అది ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిపై పడటంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.