News April 10, 2024

తూ.గో: 2 నెలలు బంద్..కారణం ఇదే..!

image

తూ.గో జిల్లాలో ఈనెల 15 నుంచి జూన్ 16 వరకు అన్ని రకాల చేపల వేటలు నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు మత్స్య శాఖ అధికారులు తెలిపారు. సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించి వాటి సంతతిని ప్రోత్సహించడమే ఉద్దేశమన్నారు. ఉత్తర్వులు ధిక్కరించి చేపల వేటకు వెళితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News December 7, 2025

రేపు ‘నన్నయ్య’కు మాజీ ఉపరాష్ట్రపతి

image

ఆదికవి నన్నయ వర్సిటీలో 8, 9 తేదీల్లో “భారతీయ భాషలలో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం”పై జాతీయ కార్యశాల జరగనుంది. కేంద్ర విద్యాశాఖ, భారతీయ భాషా సమితి సహకారంతో నిర్వహించే ఈ సదస్సుకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. శాస్త్రీయ పదజాలాన్ని ప్రాంతీయ భాషల్లోకి సులభతరం చేసే లక్ష్యంతో ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

News December 7, 2025

రాజమండ్రిలో నేటి చికెన్ ధరలు ఇలా

image

రాజమండ్రి మార్కెట్లో ఆదివారం చికెన్, మటన్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. స్కిన్ లెస్ చికెన్ ధర కేజీ రూ.250గా ఉండగా, స్కిన్ చికెన్ రూ.230కి విక్రయిస్తున్నారు. లైవ్ కోడి రూ.140-150 మధ్య లభిస్తోంది. ఇక, మటన్ ధర కేజీకి రూ.900గా ఉంది. ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు నమోదవుతున్నాయి. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News December 7, 2025

కొవ్వూరు బీజేపీలో ఆధిపత్య పోరు

image

కొవ్వూరు BJPలో ఆధిపత్య పోరు ఉందని ప్రచారం సాగుతోంది. జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పరిమి రాధాకృష్ణ మధ్య సఖ్యత లోపించిందని క్యాడర్ గుసగుసలాడుతోంది. తాజాగా కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో రెండు హాల్టుల పునరుద్ధరణపై ఇరువురు నేతలు తమ మద్దతుదారులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. క్రమశిక్షణకు మారుపేరైన BJPలో ఇలాంటి పరిస్థితి ఏంటని కార్యకర్తలు వాపోతున్నారు.