News January 19, 2025

తూ.గో: 20వ తేదీన యథావిధిగా పీజిఆర్ఎస్

image

ఈనెల 20వ తేదీన సోమవారం రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలందరూ గమనించాలని సూచించారు.

Similar News

News February 12, 2025

కొవ్వూరు: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

వాడపల్లికి చెందిన చిట్రా సూర్య(20) మంగళవారం ఇంట్లో ఉరేసుకుని బలవర్మణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. రాజమండ్రిలో ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న అతడికి ఓ బాలికతో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నెల 9వ తేదీన ఆమెను కలిసేందుకు వెళ్లాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో అతడిని బెదిరించి దుర్భాషలాడారు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెంది అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News February 12, 2025

రాజమండ్రి: టెన్త్ అర్హతతో 38 ఉద్యోగాలు

image

రాజమండ్రి డివిజన్‌లో 38 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News February 12, 2025

రాజమండ్రి: బ్యాంకర్లు కీలకపాత్ర వహించాలి: కలెక్టర్

image

అల్పాదాయ వర్గాలకు, రైతులకు, మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు రుణాలు మంజూరు, యూనిట్స్ గ్రౌండింగ్ ప్రక్రియలో బ్యాంకర్లు కీలకపాత్ర వహించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద బ్యాంక్ రీజినల్, పశుసంవర్ధక శాఖ తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రతి బ్యాంకర్లు వారి బ్యాంకు తరపున ఒక నోడల్ అధికారిని నియమించి సమాచారాన్ని అందచేయాలన్నారు.

error: Content is protected !!