News September 19, 2024
తూ.గో: 24లోపు స్కాలర్షిప్ పరీక్ష కోసం దరఖాస్తులు

తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈనెల 24వ తేదీలోపు నేషనల్ మెయిన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు తెలిపారు. ఈ మేరకు ఆయన రాజమహేంద్రవరంలో గురువారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. https://www.bse.ap.gov.in ఆసక్తి గల విద్యార్థులందరూ ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News December 6, 2025
రాజమండ్రి: విద్యార్థులకు ముఖ్య గమనిక

నన్నయ విశ్వవిద్యాలయం రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్‌లలోని పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్స్ ఈ నెల 8 నుండి 12వ తేదీ వరకు రాజమండ్రి క్యాంపస్‌లో నిర్వహిస్తున్నామని వీసీ ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. శనివారం వర్సిటీలో ఈ వివరాలు వెల్లడించారు. ఎం.ఏ., ఎం.కామ్, ఎం.పీ.ఈడీ, ఎంఎస్సీ ప్రోగ్రామ్స్‌కు ఈ అడ్మిషన్స్ ఉంటాయని వీసీ పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
News December 6, 2025
10 లోపు సంతకాల సేకరణ పూర్తి చేయాలి: చెల్లుబోయిన

కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసి ఈ నెల 10వ తేదీన జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేయాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ఆదేశించారు. అనంతరం 13వ తేదీన వాటిని కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపనున్నట్లు ఆయన తెలిపారు. బొమ్మూరు పార్టీ కార్యాలయం నుంచి జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తి అధ్యక్షతన శనివారం నిర్వహించిన గూగుల్ మీట్ సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు.
News December 6, 2025
8న పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

డిసెంబర్ 8న రాజమండ్రి కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల, గ్రామ సచివాలయ స్థాయిల్లో PGRS కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ వేదిక ద్వారా ప్రజల అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ప్రధాన లక్ష్యమన్నారు. అర్జీదారులు తమ వినతిపత్రాలను Meekosam.ap.gov.in ద్వారా ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చని ఆమె చెప్పారు.


