News June 5, 2024
తూ.గో.: 25 ఏళ్ల తర్వాత TDP గెలిచింది ఇక్కడే

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని 19 స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు హవా చూపించారు. అన్నిచోట్ల స్పష్టమైన మెజారిటీతో ఘన విజయం సాధించి జిల్లాను క్లీన్ స్వీప్ చేశారు. ఇదే క్రమంలో ఉమ్మడి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో చరిత్ర తిరగరాశారు. ప్రత్తిపాడు, జగ్గంపేట, కొత్తపేట నియోజకవర్గాల్లో 1999లో గెలిచిన TDP ఆపై ఎప్పుడూ గెలవలేదు. దాదాపు 25 ఏళ్ల తర్వాత తాజాగా టీడీపీ పాగా వేసింది.
Similar News
News July 5, 2025
పేరెంట్స్ డే నిర్వహణకు సమాయత్వం కావాలి: కలెక్టర్

జులై 10న ప్రభుత్వం నిర్వహించే పేరెంట్స్ డే నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్వం కావాలని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో మెగా పేరెంట్స్ డే, టీచర్స్ మీటింగ్, పి4 సర్వే, అన్నదాత సుఖీభవపై జిల్లా అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు అన్ని యాజమాన్యాల్లో ఉన్న స్కూళ్లలో పేరెంట్స్ డే నిర్వహిస్తామన్నారు. జేసీ కార్యచరణ ప్రణాళిక వివరించారు.
News July 5, 2025
కొవ్వూరు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

కొవ్వూరు రైల్వే స్టేషన్ శివారున గుర్తు తెలియని (35) ఏళ్ల వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గుర్తించినట్లు రైల్వే ఎస్ఐ పి.అప్పారావు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 10 గంటల మధ్య సమయంలో రైలు నుంచి జారిపడి మరణించి ఉండొచ్చని ఎస్ఐ తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, వివరాల కోసం 9347237683 నంబర్‌ను సంప్రదించాల్సిందిగా కోరారు.
News July 5, 2025
ఇసుక అధిక లోడుతో వెళితే చర్యలు: కలెక్టర్ హెచ్చరిక

ఇసుక అధిక లోడు వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి.ప్రశాంతి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఇసుక ర్యాంప్‌ల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. తాళ్లపూడి, ప్రక్కిలంక, వేగేశ్వరపురం ర్యాంపు నుంచి అధిక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. నిబంధనలు పాటించని ఏజెన్సీలకు ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండానే రద్దు చేస్తామని హెచ్చరించారు. వాహనాల లోడింగ్, పడిన ఇసుక తొలగింపు బాధ్యత ఏజెన్సీలదే అన్నారు.