News September 8, 2024
తూ.గో.: 3 జిల్లాలకు DCC నూతన అధ్యక్షులు

తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు నూతనంగా డీసీసీ అధ్యక్షులను నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మద్దేపల్లి సత్యానందరావు నియమితులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా టీకే విశ్వేశ్వర్ రెడ్డిని నియమించారు.
Similar News
News April 15, 2026
ఈనెల 17న రాజమండ్రిలో జాబ్ మేళా

రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఏప్రిల్ 17వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ బుధవారం తెలిపారు. పలు ప్రముఖ కంపెనీలలోని ఉద్యోగాలకు కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూ నిర్వహిస్తారని తెలియజేశారు. టెన్త్, ఇంటర్, ITI, డిగ్రీ, M.B.A పూర్తిచేసి 19 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని వివరించారు.

ఇంటర్ ఫలితాల్లో తూ.గో జిల్లా సత్తా..!

ఇంటర్ ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 19,977 మందికి 16,439 మంది పాసయ్యారు. 82 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 18,,337 మంది పరీక్షలు రాయగా 15,707 మంది పాసయ్యారు. 86 శాతం పాస్ పర్సంటేజీతో తూ.గో. జిల్లా రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచింది.