News March 27, 2024

తూ.గో.: 31న ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక

image

ఉమ్మడి తూ.గో. జిల్లా బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ సంఘ జిల్లా కార్యదర్శి బొజ్జా మాణిక్యాలరావు తెలిపారు. స్త్రీ, పురుషుల విభాగంలో జట్ల ఎంపిక ఉంటుందన్నారు. అమలాపురం జడ్పీ పాఠశాలలో ఆరోజు ఉదయం 8 గంటల నుంచి ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. అర్హులైన వారు ఆధార్, పుట్టిన తేదీ ధ్రువపత్రాలతో రావాలని ఆయన సూచించారు.

Similar News

News October 6, 2024

ఆలమూరు: గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

image

ఆలమూరు మండలం చొప్పెల్ల పంట కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైందని ఆలమూరు ఎస్సై అశోక్ ఆదివారం తెలిపారు. లాకులు దాటిన తర్వాత 40 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళ మృతదేహాన్ని గుర్తించడం జరిగిందన్నారు. పచ్చ రంగు జాకెట్, బిస్కెట్ కలర్ లంగా ధరించి ఉందన్నారు. ఎత్తు సుమారు 5.2 అడుగులు ఉంటుందని తెలిపారు. ఆమె వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News October 6, 2024

ఆత్రేయపురం: జాతీయ హ్యాండ్ బాల్ జట్టులో ప్రణీత్ వర్మ

image

జాతీస్థాయి హ్యాండ్ బాల్ జట్టులో ఆత్రేయపురానికి చెందిన ముదునూరి ప్రణీత్ వర్మకు స్థానం దక్కించుకున్నాడు. సీ.బీ.యస్.ఇ సౌత్ జోన్ రాష్ట్రాలు పాల్గొన్న హ్యాండ్ బాల్ పోటీలలో అండర్ -19 విభాగంలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ తరపున ముదునూరి ప్రణీత్ వర్మ జట్టుకు ప్రథమ స్థానం లభించిందని స్కూల్ ఉపాధ్యాయులు తెలిపారు. దీంతో ప్రణీత్ వర్మను గ్రామస్థులు అభినందిస్తున్నారు.

News October 6, 2024

సముద్రంలోకి 1,62,276 క్యూసెక్కుల మిగులు జలాలు

image

రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శనివారం సాయంత్రానికి 1,62,276 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరిందని పేర్కొన్నారు. అలాగే డెల్టా కాలువలకు 14,000 క్యూసెక్కుల నీటిని వదిలామన్నారు.