News September 26, 2024

తూ.గో: 4వరోజు గాలింపు.. రంగంలోకి డాగ్ స్క్వాడ్

image

ఏలూరు ఆశ్రం వైద్య విద్యార్థులు ఏజెన్సీలోని జలపాతం వద్ద నాలుగు రోజుల కింద గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో విద్యార్థి హరదీప్ ఆచూకీ ఇప్పటికి తెలియరాలేదు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. జిల్లా అధికారుల సమక్షంలో గురువారం డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఏజెన్సీని జల్లెడపట్టారు. అయినా హరదీప్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబీకులు ఆందోళనలో ఉన్నారు.

Similar News

News December 10, 2025

రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఉనగట్ల విద్యార్థులు ఎంపిక

image

చాగల్లు మండలం ఉనగట్ల జడ్పీ హైస్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల చిట్యాలలో జరిగిన జిల్లా స్థాయి అండర్-14 విభాగంలో ఈ విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారని హెచ్‌ఎం ఎన్.వీ. రమణ తెలిపారు. పంతగాని లాస్య, కంచర్ల హనీ చక్కటి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు.

News December 10, 2025

తూ.గో: గ్రామీణ రహదారుల మరమ్మతులకు భారీగా నిధులు

image

గ్రామీణ రహదారుల మరమ్మతులు, నిర్మాణాల కోసం ఏపీఆర్‌ఎస్‌పీ పథకం కింద ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించింది. ఉమ్మడి గోదావరి జిల్లాలకు ఏకంగా రూ.363.33 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో 57 పనులకు రూ.72.39 కోట్లు, కోనసీమ జిల్లాలో 78 పనులకు రూ.130.79 కోట్లు, కాకినాడ జిల్లాలో 106 పనులకు రూ.160.15 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు.

News December 10, 2025

ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో క్రీడల ద్వారా ప్రతిభ: కలెక్టర్

image

ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో నమ్మకం, ధైర్యం, ప్రతిభను వెలికి తీయడంలో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయని కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. రాజమండ్రిలోని ఎస్‌కేవీటీ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను కమిషనర్ ప్రారంభించారు. ప్రత్యేక ప్రతిభావంతులైన చిన్నారుల్లో అపారమైన సృజనాత్మకత, ప్రత్యేక కౌశలాలు దాగి ఉన్నాయని వారు పేర్కొన్నారు.