News November 7, 2024
తూ.గో: 4,02,331 ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్స్
తూ.గో.జిల్లాలో దీపం పథకం ఉచిత గ్యాస్ సిలిండర్లను పొందేందుకు 4,02,331 బుకింగ్స్ అవ్వగా వాటిలో 3,59,462 మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు రాజమహేంద్రవరంలో తెలిపారు. మొదటి గ్యాస్ సిలిండర్‌ను లబ్ధిదారులు పొందేందుకు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అవకాశం ఉందన్నారు. లబ్ధిదారులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.
Similar News
News December 3, 2024
కాకినాడ: ‘ఎమ్మెల్సీ పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించాలి’
ఈ నెల 5న జిల్లాలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఏఆర్వో జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో పోలింగ్ అధికారులు, సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జె.వెంకటరావు హాజరయ్యారు.
News December 2, 2024
ప్రధానితో కలిసి సినిమా చూశా: ఎంపీ పురందేశ్వరి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాని సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి వీక్షించడం జరిగిందని సోమవారం X లో పోస్ట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి సినిమా వీక్షిస్తూ ప్రేక్షకుల్లో భాగమయ్యారు. ఆనందంగా ఉందని వారితో కలిసి తీసిన సెల్ఫీని పోస్ట్ చేశారు.
News December 2, 2024
కాకినాడ: రేపు యధావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ
కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం యధావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 9:30 గంటల నుంచి కలెక్టరేట్ వద్ద, జిల్లాలోని అన్ని మండల స్థాయి, డివిజన్ స్థాయి కార్యాలయాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ఆర్జీల రూపంలో అందిస్తే పరిష్కరమిస్తామన్నారు