News June 21, 2024
తూ.గో.: ‘500 మార్కుల కంటే ఎక్కువ వస్తే బహుమతి’
ఉమ్మడి తూ.గో జిల్లాలో ఈ ఏడాది టెన్త్ పరీక్ష ఫలితాల్లో 500 మార్కులు పైగా వచ్చిన భట్రాజు సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు రూ.2 వేల నగదు ప్రోత్సాహక బహుమతి, జ్ఞాపిక అందిస్తామని తూ.గో జిల్లా భట్రాజు సంక్షేమ సంఘం అధ్యక్షుడు లోలభట్టు శ్రీనివాసరాజు రాజమండ్రిలో గురువారం తెలిపారు. మార్కుల జాబితా, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్‌తో ఈ నెలాఖరులోగా 94935 47944 నంబర్‌కు వివరాలు పంపాలని సూచించారు.
Similar News
News September 14, 2024
రాజానగరంలో తీవ్ర విషాదం
రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. టీ పొడి అనుకుని పొరపాటున వృద్ధ దంపతులు పురుగు మందు వేసుకొని టీ తాగారు. ఈ ప్రమాదంలో వెలుచూరి గోవింద్(75), అప్పాయమ్మ (70) మృతి చెందారు. అప్పాయమ్మకు కంటి చూపు తక్కువగా ఉండడంతో పొలాలకు చల్లే గుళికల ప్యాకెట్‌ను టీ ప్యాకెట్‌గా భావించి టీ పెట్టుకొని తాగారు. కొద్దిసేపటికే నోటి నుంచి నురగలు రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
News September 14, 2024
కాకినాడ: యాంకర్ శ్యామలకు వైసీపీలో కీలకపదవి
వైసీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రముఖ యాంకర్ శ్యామల నియమితులయ్యారు. కాకినాడలోని ఇంద్రపాలేనికి చెందిన శ్యామల సీరియల్ నటిగా, యాంకర్‌గా పేరు సంపాదించుకున్నారు. పలు సినిమాల్లోనూ నటించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ జిల్లాలో వైసీపీ తరఫున విస్తృత ప్రచారం చేశారు.
News September 14, 2024
ఉమ్మడి తూ.గో. జడ్పీ ఇన్‌ఛార్జి CEOగా పాఠంశెట్టి
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ ఇన్‌ఛార్జి సీఈవోగా పాఠంశెట్టి నారాయణ మూర్తి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన కాకినాడ డివిజన్ డీఎల్డీవో విధులు నిర్వర్తిస్తున్నారు. సీఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇంతవరకు ఇక్కడ సీఈవోగా పనిచేసిన ఎ.శ్రీరామచంద్రమూర్తి రిలీవ్ అయిన విషయం తెలిసిందే.