News November 11, 2024
తూ.గో: 7 రోజులపాటు ట్రైనీ ఐఏఎస్ల పర్యటన

ఆల్ ఇండియా సర్వీసెస్కు ఎంపికై శిక్షణ పొందుతున్న అధికారులు తమ శిక్షణలో భాగమైన క్షేత్రస్థాయి పర్యటనలను తూర్పుగోదావరి జిల్లాలో 7 రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద శిక్షణకు ఎంపికైన 10 మంది ఐఏఎస్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి క్షేత్రస్థాయి పర్యటనల్లో చేపట్టవలసిన పరిశోధనలపై అవగాహన కల్పించారు
Similar News
News December 6, 2025
పోలీసులు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు: ఎస్పీ

పోలీసు శాఖలో అవినీతి, అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఎస్పీ డి.నరసింహా కిషోర్ స్పష్టం చేశారు. సిబ్బందిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నిర్దిష్టమైన ఆధారాలు ఉంటే బాధ్యులపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు.
News December 5, 2025
ఒత్తిడికి లోనుకాకుండా చదవాలి: కలెక్టర్

తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన మెగా PTM 3.0ను కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అన్నదేవరపేట ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్, అన్నదేవరపేట ప్రభుత్వ హైస్కూల్, వేగేశ్వరపురం ప్రభుత్వ హైస్కూల్లను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్.. ఒత్తిడికి లోనుకాకుండా చదవాలని, వెనుకబడిన సబ్జెక్టుల్లో ప్రత్యేక తరగతులకు హాజరు కావాలని విద్యార్థులకు సూచించారు.
News December 5, 2025
రాజమండ్రి: 5000 కెమెరాలు..17 డ్రోన్లతో నిఘా

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 5 వేల సీసీ కెమెరాలు, 17 డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అదుపు చేయగలిగామని ఎస్పీ డి. నరసింహ కిషోర్ తెలిపారు. గత 11 నెలల కాలంలో 1137 డ్రంక్ అండ్ డ్రైవ్, 399 పేకాట, 242 కోడి పందాలు, 126 సారా, 49 గంజాయి కేసులు నమోదు చేశామన్నారు. అదృశ్యమైన 136 మంది బాలికల్లో 133 మందిని గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు.


