News July 4, 2024
తూ.గో.: BREAKING: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

అమలాపురం రూరల్ మండలం కామనగురువు పంచాయతీ పరిధిలోని కిమ్స్ ఆసుపత్రి సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆర్టీసీ నాన్ స్టాప్ బస్సు ఢీకొన్న ఘటనలో బట్నవిల్లి గ్రామానికి చెందిన తొత్తరమూడి బుల్లి సత్యనారాయణ (53) అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News December 15, 2025
రాజమండ్రి: పీజీఆర్ఎస్కు 23 అర్జీలు

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు 23 అర్జీలు అందాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ స్వయంగా బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా విచారణ జరిపి, బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 15, 2025
తూ.గో: రబీ యూరియా సరఫరాకు ప్రణాళిక సిద్ధం

జిల్లాలో రబీ సీజన్ (2025–26) పంటలకు అవసరమైన యూరియా సరఫరాకు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు తెలిపారు. ఈ సీజన్కు 58.95 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా, డిసెంబర్ 1 నాటికి 3.40 వేల మెట్రిక్ టన్నుల ప్రారంభ నిల్వ అందుబాటులో ఉందని సోమవారం వెల్లడించారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువుల పంపిణీ చేపడతామని పేర్కొన్నారు.
News December 15, 2025
తూ.గో: కల్లు అమ్మకాలు నిలిపివేయించిన ఎమ్మెల్యే.. అసలేం జరిగిందంటే..!

ఆధ్యాత్మిక స్థలాల్లో ధార్మిక ఆచారాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హెచ్చరించారు. ఏవీఏ రోడ్డులోని జీవకారుణ్య సంఘ స్థలంలో ఆ సంస్థ మాజీ డైరెక్టర్ చొల్లంగి ఏడుకొండలు కల్లు విక్రయాలు సాగిస్తున్నట్లు తెలియడంతో అధికారులతో కలిసి అక్కడికి వెళ్లి వాటిని నిలిపివేయించారు. పవిత్రమైన ప్రాంతాల్లో ఇలాంటి పనులు చేయడం తగదని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది హెచ్చరించారు.


