News April 15, 2024

తూ.గో.: CM జగన్‌పై దాడి.. KA పాల్ రియాక్షన్ ఇదే

image

గత ఎన్నికలకు ముందు జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన కోడికత్తి దాడి విషయంలోనూ అందరూ ముందు దాడి అన్నారని, ఆ తర్వాత డ్రామా అన్నారని ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. రాజమండ్రిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జరిగిన దాడి కూడా నిజంగా జరిగిందా లేదా ఓట్ల సానుభూతి కోసం చేయించారా అన్నది తెలియాల్సి ఉందన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీచేసే విషయంపై ఆలోచిస్తానన్నారు.

Similar News

News September 30, 2024

తూ.గో: ఫొటోషూట్‌.. వాగులో గల్లంతైన విద్యార్థి

image

ఫ్రెండ్స్‌తో సరదాగా ఫొటోషూట్‌కు వెళ్లిన ఓ విద్యార్థి వాగులో గల్లంతయ్యాడు. ఈ ఘటన తూ.గో జిల్లా సీతానగరంలో జరిగింది. కుటుంబీకులు, పోలీసుల వివరాల ప్రకారం.. సీతానగరానికి చెందిన వి.వినయ్(15) రఘుదేవపురంలోని ఓ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఫ్రెండ్స్‌తో కలిసి బైక్‌‌లపై ఫొటోషూట్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో వినయ్ వాగులో గల్లంతు కాగా.. రాత్రి 9 గంటల వరకు గాలించినా అతడి ఆచూకీ లభించలేదు.

News September 29, 2024

కాకినాడ వాసి ఫిర్యాదు.. యాపిల్ సంస్థకు రూ.లక్ష ఫైన్

image

ప్రముఖ మొబైల్ సంస్థ ‘యాపిల్’కు కాకినాడ వినియోగదారుల కమిషన్ రూ.లక్ష ఫైన్ విధించింది. కాకినాడలోని సూర్యారావుపేటకు చెందిన పద్మరాజు 2021 OCT 13న రూ.85,800లకు యాపిల్ ఫోన్ కొన్నారు. ఫోన్ కొంటే ఇయర్ పాడ్స్ ఫ్రీ అని ప్రకటించిన సంస్థ.. తనకు ఫోన్ పంపి, ఇయర్ పాడ్స్ ఇవ్వలేదని పద్మరాజు పలుమార్లు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశారు. స్పందన లేకపోవడంతో ఆయన 2022లో కమిషన్‌ను ఆశ్రయించగా.. శనివారం తీర్పు వెలువడింది.

News September 29, 2024

మార్కెట్‌లో షాక్ ఇస్తున్న ‘కొత్తిమీర’ ధరలు

image

ఏ కూరైనా సరే ఘుమఘుమలాడాలంటే చివరలో కాస్తంత ‘కొత్తిమీర’ పడాల్సిందే. అయితే.. ప్రస్తుత ధర చూసి సామాన్యులు కొత్తమీర కట్ట కొనాలంటేనే జంకుతున్నారు. ఉమ్మడి తూ.గో జిల్లాలో కొన్ని చోట్ల ఒక్కో కట్ట ధర రూ.50 ఉండగా.. కిలో రూ.300పైనే ఉంది. ఇదొక్కటే కాదు ఆకుకూరల రేట్లన్నీ అదే రేంజ్‌లో ఉన్నాయి. ఇటీవలి వర్షాల దెబ్బకు ఆకుకూరల పంటలు దెబ్బతినడంతో దిగుబడి తగ్గి రేట్లు భగ్గుమంటున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.