News July 15, 2024
తూ.గో: GOOD NEWS.. పోస్టాఫీసులో 111 ఉద్యోగాలు

పదో తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అమలాపురం డివిజన్లో 28, కాకినాడ డివిజన్లో 29, రాజమండ్రి డివిజన్లో 54 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం-రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం-రూ.10 వేలు+అలవెన్సులు ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
☞ SHARE IT..
Similar News
News September 17, 2025
రాజమండ్రి : రాష్ట్ర సమాచార కేంద్రం ఏడీగా రామచంద్రరావు

ఏలూరు జిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న ఆర్.వి.ఎస్. రామచంద్రరావు పదోన్నతిపై రాజమహేంద్రవరం రాష్ట్ర సమాచార కేంద్రం సహాయ సంచాలకుడిగా బుధవారం విధుల్లో చేరారు. ప్రస్తుతం అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.లక్ష్మణా చార్యులు నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఇన్ఛార్జి సహాయ సంచాలకుడు రామచంద్రరావుకు సిబ్బంది ఆహ్వానం పలికి అభినందనలు తెలిపారు.
News September 17, 2025
రాజానగరం: డా.రెడ్డీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను పరిశీలించిన వీసీ

నన్నయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగంలో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ విద్యార్థులకు నిర్వహించిన డా.రెడ్డీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ పరిశీలించారు. యూనివర్సిటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆచార్య బి. జగన్మోహన్ రెడ్డి, సంస్థ హెచ్.ఆర్ లక్ష్మీదుర్గలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విశ్వవిద్యాలయం తరఫున ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని వీసీ కోరారు.
News September 17, 2025
కలెక్టర్కు కీర్తి చేకూరికి ఉద్యమ నోటీసులిచ్చిన సచివాలయ ఉద్యోగులు

గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా ఐక్యవేదిక తరఫున జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి సచివాలయ ఉద్యోగులు 15 రోజుల ముందస్తు ఉద్యమ కార్యాచరణ నోటీసును అందజేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయలో ఐక్యవేదిక నాయకులు కలిసి ఈ వినతిని ఇచ్చారు. దడాల జగ్గారావు, కాశీ విశ్వనాథ్, రామాంజనేయులు, నాయుడు, కొల్లి రాజేష్, రామదాసు తదితరులు ఉన్నారు.