News June 25, 2024
తూ.గో: GOOD NEWS.. 3 రైళ్ల పునరుద్ధరణ

రాజమండ్రి స్టేషన్ మీదుగా రద్దు చేసిన 26 ట్రైన్లలో 3 రైళ్లను రైల్వేశాఖ పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం నుంచి విశాఖ-లింగంపల్లి మధ్య జన్మభూమి ఎక్స్‌ప్రెస్ యధావిధిగా నడవనుంది. అలాగే కాకినాడ పోర్ట్-పాండిచ్చేరి మధ్య సర్కార్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ పోర్టు-విజయవాడ మధ్య మెమూ ఎక్స్‌ప్రెస్‌లను కూడా యధావిధిగా నడపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
➠ SHARE IT..
Similar News
News November 22, 2025
తూ.గో జిల్లాకు రాష్ట్రంలో ప్రథమ స్థానం

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు గణాంకాలలో తూర్పు గోదావరి జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం గర్వకారణమని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం పేర్కొన్నారు. 75.54 శాతం మార్కులతో జిల్లా ఈ ఘనత సాధించిందన్నారు. సేవల్లో నాణ్యత, ఆరోగ్య ప్రచార కార్యక్రమాల నిర్వహణతో ఆదర్శంగా నిలిచి రాష్ట్రంలో ప్రథమ స్థానం వచ్చినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.
News November 22, 2025
“తూర్పు”లో టెన్త్ రాయనున్న 26,619 విద్యార్థులు

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ కె.వాసుదేవరావు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి మొత్తం 26,619 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు. విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివి విజయం సాధించాలని డీఈఓ సూచించారు.
News November 22, 2025
సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు: శశాకం

సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు అర్హత పొందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు విజయవాడలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు రాజమహేంద్రవరం బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు బి. శశాంక తెలిపారు. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 25లోగా స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. డిసెంబర్ 5న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.


