News August 1, 2024

తూ.గో: PET పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ, కోనసీమ, తూ.గో జిల్లాలలో అంబేడ్కర్ గురుకుల బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు జిల్లా సమన్వయాధికారి జి.వెంకటరావు వివరాలు వెల్లడించారు. ఆగస్టు 3వ తేదీలోపు జిల్లా కోఆర్డినేటర్, కలెక్టరేట్ కాంపౌండ్, వికాస ఆఫీసుల్లో దరఖాస్తుల స్వీకరిస్తామన్నారు.

Similar News

News December 1, 2025

ఏపీలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ: మంత్రి కందుల

image

సినిమా షూటింగ్‌లు, పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కొత్త అధ్యాయం రచిస్తున్నామని మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. సోమవారం ముంబయిలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ – 2025’లో ఆయన ఈ విషయం తెలిపారు. ఏపీలో సమగ్రమైన కొత్త ‘ఫిల్మ్ టూరిజం పాలసీ’ని ఆవిష్కరించడానికి తమ ప్రభుత్వం వేగంగా కృషి చేస్తుందని మంత్రి వెల్లడించారు.

News December 1, 2025

2.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: కలెక్టర్

image

తూ.గో జిల్లాలో 2 లక్షల 10వేల 210 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం ప్రకటించారు. ఈ ఖరీఫ్‌లో ధాన్యం సేకరణకు సంబంధించి 42,822 కూపన్లను జనరేట్ చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే 11,767 మంది రైతులకు రూ.2,0246 కోట్లను చెల్లించామన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలన్నారు.

News December 1, 2025

తూ.గో: చేతబడి చేశారన్న అనుమానంతో దారుణ హత్య

image

కోరుకొండ (M) దోసకాయలపల్లిలో ఆనంద్ కుమార్ (30) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. ఆనంద్ తనకు చేతబడి చేశాడని రాజ్‌కుమార్ అనుమానంతో కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఆనంద్ భార్య త్రివేణికి రాజ్ కుమార్ సమీపబంధువు. అతను కొన్నాళ్లు ఆనంద్ ఇంట్లో ఉండేవాడు. ఆ సమయంలో భార్య పట్ల రాజ్‌కుమార్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని అతన్ని బయటికి పంపించారు. కక్ష పెట్టుకున్న రాజ్‌కుమార్ హత్య చేశాడని CI సత్య కిషోర్ వివరించారు.