News October 19, 2024

తూ.గో. TODAY HEADLINES

image

* 172 మందిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు: SP నరసింహ
* అభ్యంతరాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్
* ఉప్పలగుప్తంలో 115 ఏళ్ల వృద్ధురాలు మృతి
* హైదరాబాద్‌లో ముగ్గురు జిల్లా యువకులు అరెస్ట్
* తుని: 18 మంది పోలీసుల బదిలీ
* వైఎస్ జగన్‌ని కలిసిన పిల్లి సూర్యప్రకాష్
* కాకినాడలో ఏడుగురికి జైలు శిక్ష
* అంబాజీపేట: ప్రత్యేక ఆకర్షణగా మహిళల నృత్యాలు
* బిక్కవోలులో భారీ వర్షం

Similar News

News January 30, 2026

రాజమండ్రి: 60 ఏళ్ల తర్వాత రూ.3,000 పెన్షన్..!

image

అసంఘటిత రంగ కార్మికులు, చిన్న వ్యాపారులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత, స్థిర ఆదాయం అందించాలనే లక్ష్యంతో PM-SYM – PM-LVM ద్వారా జాతీయ పెన్షన్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని జిల్లా సహాయ కార్మిక కమీషనర్ B.S.M వలి శుక్రవారం తెలిపారు. లబ్ధిదారులు 60 సంవత్సరాలు నిండిన తర్వాత జీవితాంతం ప్రతి నెలా రూ.3 పెన్షన్ పొందవచ్చన్నారు. ఆసక్తి గలవారు కార్మిక శాఖ కార్యాలయం, మీ-సేవా కేంద్రంలో సంప్రదించాలన్నారు.

News January 30, 2026

తూ.గో: రెండో రోజు కొనసాగుతున్న ఏసీబీ దాడులు

image

కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల విచారణ రెండోరోజు కొనసాగుతోంది. గురువారం రాత్రి డీఎస్పీ కిషోర్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఆకస్మిక తనిఖీల్లో లెక్కతేలని రూ.1,82,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రార్ లక్ష్మిపై వస్తున్న వరుస అవినీతి ఆరోపణల నేపథ్యంలో, గత రెండు రోజులుగా జరిగిన రిజిస్ట్రేషన్ పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

News January 30, 2026

రాజమండ్రి కార్గో విమాన సదుపాయాలపై పార్లమెంట్‌లో పురంధేశ్వరి ప్రశ్న

image

రాజమండ్రి విమానాశ్రయం నుంచి ఆక్వా ఉత్పత్తులు, నర్సరీ మొక్కలు, ఇతర నిత్యావసరాల ఎగుమతుల కోసం ప్రత్యేక కార్గో టెర్మినల్ ఏర్పాటుపై ఎంపీ పురంధేశ్వరి శుక్రవారం పార్లమెంట్‌లో గళమెత్తారు. దీనిపై పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ స్పందిస్తూ.. కార్గో సదుపాయాల కల్పన మార్కెట్ డైనమిక్స్‌పై ఆధారపడి ఉంటుందని వెల్లడించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.