News November 8, 2024

తూ.గో: TODAY TOP NEWS

image

*గోకవరం: షర్మిలను కలిసిన కాంగ్రెస్ నాయకులు
*కాకినాడ: దీపం-2 పథకంపై జేసీ సమీక్ష
*పి.గన్నవరం: పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఎమ్మెల్యే గిడ్డి
*తుని: మహిళ అదృశ్యంపై కేసు నమోదు
*పవన్ కళ్యాణ్‌తో హోంమంత్రి అనిత భేటీ
*జగ్గంపేట: టీటీడీ ఛైర్మన్‌ను కలిసిన MLA నెహ్రూ
*గొల్లప్రోలు: బాలిక అదృశ్యంపై హోంమంత్రి ఆరా
*రాజమండ్రి: చంద్రబాబు ఫోటోకు మహిళలు పాలాభిషేకం
*రాజమండ్రి ఎయిర్ పోర్టులో బుల్లెట్లు కలకలం

Similar News

News December 2, 2024

కాకినాడ: రేపు యధావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ

image

కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం యధావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 9:30 గంటల నుంచి కలెక్టరేట్ వద్ద, జిల్లాలోని అన్ని మండల స్థాయి, డివిజన్ స్థాయి కార్యాలయాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ఆర్జీల రూపంలో అందిస్తే పరిష్కరమిస్తామన్నారు

News December 1, 2024

గండేపల్లిలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. ఎల్లమిల్లి గ్రామానికి చెందిన కర్ణం నాగరత్నం(58) స్వగ్రామం నుంచి తాళ్లూరు గుడికి వచ్చి దర్శనం అనంతరం బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News December 1, 2024

గండేపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామ శివారులో శనివారం టిప్పర్ బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో మహిళ మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. ఎల్లమిల్లి గ్రామానికి చెందిన కర్ణం నాగరత్నం (58), ఎల్లమెల్లి నుంచి తాళ్లూరు గుడికి వచ్చి దర్శనం అనంతరం బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొంది. ప్రమాదంలో మహిళ మృతి చెందింది. లారీ డ్రైవర్ అతి వేగంవల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.