News October 23, 2024
తూ.గో: TODAY TOP NEWS
* కాకినాడ: సీఎంను ఆహ్వానించిన ఎమ్మెల్యే నెహ్రూ
* రాజధానిని జగన్ సర్వనాశనం చేశారు: మాజీ ఎమ్మెల్యే వర్మ
* ముమ్మిడివరం: వ్యక్తి అనుమానాస్పద మృతి
* తూ.గో: శ్రీకాంత్‌ను జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్న పోలీసులు
* కరప: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉద్యోగి
* పెద్దాపురం: కూటమి నాయకుల మధ్య వాగ్వాదం
* అంబాజీపేటలో దారుణం.. దంపతుల ఆత్మహత్య
* పిఠాపురం: ఇద్దరిని ఢీ కొట్టి బోల్తాపడ్డ రొయ్యల లారీ
Similar News
News November 6, 2024
రాజమండ్రి మహిళకు మంత్రి లోకేశ్ హామీ
రాజమండ్రికి చెందిన శిరీష అనే మహిళ జీవనోపాధి కోసం బహ్రెయిన్ దేశానికి వెళ్లి అక్కడ శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు మంత్రి లోకేశ్‌కు ఎక్స్‌లో విన్నవించుకున్నారు. శిరీషను స్వదేశానికి తీసుకురావాలని పోస్టు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్ ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
News November 6, 2024
తూ.గో: గుంటూరు కోర్టుకు బోరుగడ్డ అనిల్ కుమార్
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్‌ను పోలీసులు గుంటూరు తీసుకెళ్లారు. గతంలో అతనిపై తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో రెండు కేసులు, తాడికొండలో ఒక కేసు నమోదైన విషయం తెలిసిందే. బుధవారం గుంటూరు కోర్టులో హాజరు పర్చేందుకు పోలీసులు వాహనంలో తీసుకెళ్లారు. కోర్టులో హాజరు పరిచి తిరిగి రాజమహేంద్రవరం జైలుకు తీసుకురానున్నారు.
News November 6, 2024
రాజమండ్రి: ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
ఉభయగోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ ప్రకటించిన దృష్ట్యా నవంబర్ 4 నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 11న నోటిఫికేషన్ విడుదలవుతుందని, 18న నామినేషన్ కు గడువు పూర్తవుతుందన్నారు. 19న నామినేషన్లు పరిశీలన, 21న ఉపసంహరణ ఉంటుందన్నారు. డిసెంబర్ 5న ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.