News October 24, 2024

తూ.గో: TODAY TOP NEWS

image

* కొత్తపేట: దుర్గాప్రసాద్ హత్యకేసు వివరాలను వెల్లడించిన డీఎస్పీ
* కాకినాడ: ప్రేమించి మోసం చేశాడని సూసైడ్
* ఆలమూరు: ఉరేసుకుని విద్యార్థిని మృతి.. కేసు నమోదు
* జిల్లాలో ఉచిత డీఎస్సీ శిక్షణకు చర్యలు
* రౌడీషీటర్లను పోషించేది మంత్రి సుభాషే: పిల్లి సూర్యప్రకాశ్
* కాకినాడలో సందడి చేసిన హీరో కిరణ్ అబ్బవరం
* రాష్ట్ర టిడ్కో ఛైర్మన్‌ను కలిసిన ఎమ్మెల్యే నానాజీ
* గోకవరం: పలు గ్రామాల్లో 144 సెక్షన్ అమలు

Similar News

News September 18, 2025

మెగా డీఎస్సీ అభ్యర్థులకు నేడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ

image

మెగా డీఎస్సీ నియామక పత్రాలు జారీ ప్రక్రియ 19వ తేదీన అమరావతిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు డీఈవో వాసుదేవరావు బుధవారం తెలిపారు. టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులందరూ 18వ తేదీన ఒక సహాయకునితో రాజమండ్రిలో కేటాయించిన పాఠశాలలకు రెండు పాస్ పోర్ట్ ఫోటోలు, ఆధార్ కాల్ లెటర్‌తో సాయంత్రం 4 గంటలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, బస్సుల్లో విజయవాడ పంపుతామన్నారు.

News September 18, 2025

పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: వీసీ

image

యూజీసీ నెట్, జేఆర్‌ఎఫ్, సీఎస్‌ఐఆర్ నెట్ లలో అర్హత సాధించిన అభ్యర్థులకు పీహెచ్‌డీ ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. యూనివర్సిటీలో ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినట్లు బుధవారం ఆమె వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చని సూచించారు.

News September 18, 2025

రాజమండ్రి అభివృద్దిపై మంత్రి నారాయణ సమీక్ష

image

రాజమండ్రిలో వివిధ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఇంచార్జి కమిషనర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ అధికారులు హాజరయ్యారు. అభివృద్ధి పనులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన చర్చించారు.