News October 24, 2024
తూ.గో: TODAY TOP NEWS
* కొత్తపేట: దుర్గాప్రసాద్ హత్యకేసు వివరాలను వెల్లడించిన డీఎస్పీ
* కాకినాడ: ప్రేమించి మోసం చేశాడని సూసైడ్
* ఆలమూరు: ఉరేసుకుని విద్యార్థిని మృతి.. కేసు నమోదు
* జిల్లాలో ఉచిత డీఎస్సీ శిక్షణకు చర్యలు
* రౌడీషీటర్లను పోషించేది మంత్రి సుభాషే: పిల్లి సూర్యప్రకాశ్
* కాకినాడలో సందడి చేసిన హీరో కిరణ్ అబ్బవరం
* రాష్ట్ర టిడ్కో ఛైర్మన్‌ను కలిసిన ఎమ్మెల్యే నానాజీ
* గోకవరం: పలు గ్రామాల్లో 144 సెక్షన్ అమలు
Similar News
News November 10, 2024
రాజమండ్రి: రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కుడుపూడి సత్తిబాబు
ఏపీ శెట్టిబలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి రాజమండ్రికి చెందిన కుడుపూడి సత్తిబాబుకు దక్కింది. సత్తిబాబు టీడీపీ తెలుగు యువత, బీసీ సెల్ విభాగాలలో కీలకంగా పని చేశారు. టీడీపీ బీసీ సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా, శ్రీశైలం గౌడ సత్రం డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. తన తల్లి సరస్వతీ పేరిట సరస్వతమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు.
News November 10, 2024
రాజమండ్రి: విధేయతకు దక్కిన గౌరవం ‘రుడా ఛైర్మన్’
TDP రాష్ట్ర కార్యదర్శి, రాజానగరం పార్టీ ఇన్‌ఛార్జ్ బొడ్డు వెంకట రమణ చౌదరి గత ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. మొదటి నుంచి పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేశారు. కానీ NDA కూటమి పొత్తులో భాగంగా ఎమ్మెల్యే సీటును జనసేనకు కేటాయించారు. రాజమహేంద్రవరం ఏంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ అది కూడా బీజేపీ పోయింది. ప్రస్తుతం ఆయనకు రుడా ఛైర్మన్‌గా అవకాశం కల్పించింది.
News November 9, 2024
తూ.గో: పవన్ కళ్యాణ్‌కు తమ్మల రామస్వామి కృతజ్ఞతలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాకినాడ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తుమ్మల రామస్వామి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం తనను కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్మన్‌గా నియమించినట్లు సమాచారం అందుకున్న తుమ్మల రామస్వామి (బాబు) హుటాహుటిన మంగళగిరి వెళ్లారు. అక్కడ జనసేన కార్యాలయంలో పార్టీ అధినేత పవన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు.