News September 17, 2024
తెగిపడిన గుంతకల్లు యువకుడి చెయ్యి

కడప జిల్లా నందలూరు రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి యువకుడి చెయ్యి తెగిపడిపోయిన ఘటన సోమవారం జరిగింది. గుంతకల్లుకు చెందిన కురుబ ధనుశ్ పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. రైలులో పుత్తూరుకు వెళ్తూ నందలూరుకు రాగానే ప్రమాదవశాత్తు రైలు కింద పడి చెయ్యి విరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. క్షతగాత్రుడిని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
Similar News
News February 28, 2026
అనంత: వైద్యశాఖపై జిల్లా కలెక్టర్ సమీక్ష

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా ICDS, మెడికల్ అండ్ హెల్త్ శాఖల పనితీరుపై చర్చించారు. ICDS PD, DMHO, CDPOలు, సూపర్‌వైజర్లు, వైద్యాధికారులు హాజరయ్యారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలను మెరుగుపరచాలని సూచించారు. పోషణ, టీకాలు, ఆరోగ్య శిబిరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

News February 27, 2026
అనంత: వైద్యశాఖలపై జిల్లా కలెక్టర్ సమీక్ష

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. జిల్లా ICDS, మెడికల్ అండ్ హెల్త్ శాఖల పనితీరుపై చర్చించారు. ICDS PD, DMHO, CDPOలు, సూపర్‌వైజర్లు, వైద్యాధికారులు హాజరయ్యారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలను మెరుగుపరచాలని సూచించారు. పోషణ, టీకాలు, ఆరోగ్య శిబిరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.