News June 15, 2024
తెనాలికి 4 దశాబ్దాల తర్వాత పౌరసరఫరాల శాఖ
తెనాలి శాసనసభ్యుడిగా ఎన్నికైన వారిలో సుమారు నాలుగు దశాబ్దాల క్రితం అన్నాబత్తుని సత్యనారాయణ కొంతకాలం పౌరసరఫరాల మంత్రిగా పని చేశారు. తిరిగి ఇప్పుడు నాదెండ్ల మనోహర్‌కు కూడా అదే పౌర సరఫరాల శాఖను సీఎం చంద్రబాబు కేటాయించారు. తెనాలి నుంచి గెలిచి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాదెండ్లను పలువురు పట్టణ ప్రముఖులు కలిసి అభినందనలు తెలుపుతున్నారు.
Similar News
News September 15, 2024
యడ్లపాడు వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
యడ్లపాడు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా నిడమర్రుకి చెందిన కృష్ణ (31), రవి కిషోర్ (25) అనే ఇద్దరు కారు టైరు పంక్చర్ అవ్వడంతో రోడ్డు మార్జిన్‌లో టైరు మారుస్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.
News September 15, 2024
నేడు పోలీస్ కస్టడీకి నందిగం సురేశ్
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇటీవల అరెస్ట్ అయిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను ఆదివారం మంగళగిరి రూరల్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. మంగళగిరి కోర్టు 2 రోజులు పోలీసుల కస్టడీకి అనుమతించడంతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు నందిగం సురేశ్‌ను మంగళగిరి రూరల్ పోలీసులు ప్రశ్నించనున్నారు.
News September 15, 2024
గుంటూరులో బాలికపై అత్యాచారం.. వ్యక్తి అరెస్ట్
విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి గర్భిణిని చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పాత గుంటూరు పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన 10వ తరగతి విద్యార్థినిని అదే ప్రాంతంలో నివాసం ఉండే కార్ల పెయింటర్ షేక్. కాలేషా అనే వ్యక్తి భయపెట్టి తన ఇంటిలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.