News December 6, 2024
తెనాలిని జిల్లా కేంద్రంగా మార్చాలి: సత్యకుమార్
తెనాలిని జిల్లా కేంద్రంగా మార్చాలని కొల్లూరుకు విచ్చేసిన రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబులకు కొల్లూరు మండలం టీడీపీ సీనియర్ నేత వెంకట సత్యకుమార్ వినతిపత్రం అందజేశారు. అదే విధంగా గాజుల్లంక శ్రీకాకుళం మధ్య కాజ్వే నిర్మించాలని, 75 ఎకరాలలో మూతబడి ఉన్న జంపని షుగర్ ఫ్యాక్టరీని మెడికల్ కాలేజీగా మార్చాలని కోరారు.
Similar News
News January 17, 2025
గుంటూరు: రోడ్డు ప్రమాదంలో మేనేజర్ మృతి
గేదెను తప్పించబోయి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నాదెండ్ల మండలంలో గురువారం చోటు చేసుకుంది. SI పుల్లారావు వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన SBI క్రెడిట్ కార్డు మేనేజర్ రాజేశ్, నవీన్ అనే సాటి ఉద్యోగితో బైకుపై నరసరావుపేట వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో సాతులూరు వద్ద గేదెను తప్పించబోయి వెనక వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో రాజేశ్‌కు తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందగా మరో వ్యక్తి గాయపడ్డాడు.
News January 17, 2025
గుంటూరులో MLA తమ్ముడు మృతి
గుంటూరులో గురువారం విషాదం చోటు చేసుకుంది. వెంకటగిరి MLA కురుగొండ్ల రామకృష్ణ సోదరుడు కురుగొండ్ల శేఖర్ కన్నుమూశారు. డక్కిలి మండలం కమ్మవారిపల్లికి చెందిన శేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కొద్ది కాలం క్రితం గుంటూరులో స్థిరపడ్డారు. ఈక్రమంలో నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. సమాచారం అందుకున్న MLA వెంటనే గుంటూరుకు బయల్దేరారు.
News January 17, 2025
అధికారులకు గుంటూరు కలెక్టర్ ఆదేశాలు జారీ
స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను అధికారులు సమన్వయంతో చేపట్టాలని గుంటూరు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ అధికారులకు సూచించారు. గురువారం కలక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై ప్రాధమిక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై శకటాలు రూపొందించి పరేడ్‌లో ప్రదర్శించాలన్నారు.