News January 10, 2026
తెనాలిలో అర్ధరాత్రి ఏసీ మెకానిక్ దారుణ హత్య

తెనాలి నందులపేటకు చెందిన ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్(52) హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి తెనాలి టీచర్స్ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని దుండగులు ఫయాజ్‌ను కొట్టి చంపి పడవేశారు. స్థానికులు గుర్తించి అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనా స్థలంలో కర్రలు, రాడ్లు ఉన్నట్లు గుర్తించారు. సీఐ సాంబశివరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించారు.
Similar News
News January 17, 2026
వైన్ షాపుల వద్దే పండుగ జరుగుతుంది: అంబటి

జగన్ పాలన తిరిగి వచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు. మంగళగిరి వైసీపీ కార్యాలయంలో శనివారం దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో సంస్థాగత కమిటీ నిర్మాణంపై సమావేశం జరిగింది. రాష్ట్రంలో పండుగ అంటే వైన్ షాపులు దగ్గరే జరుగుతుందని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా పథకాలు అందేవని వాటితో వారు పండగలు నిర్వహించుకునేవారని అంబటి అన్నారు.
News January 17, 2026
GNT: కలెక్టర్‌ని కలిసిన జీఎంసీ కమిషనర్

గుంటూరు నగరపాలక సంస్థ నూతన కమిషనర్ కె. మయూర్ అశోక్ శనివారం కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియాను కలిశారు. కార్పొరేషన్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన కమిషనర్ కలెక్టర్‌ని కలిసి ఆమెకు మొక్కను బహూకరించారు. ఈ సందర్భంగా నగరాభివృద్ది, ఇతర కీలక అంశాలపై ఇరువురు చర్చించారు.
News January 16, 2026
GNT: డెల్టా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు జాక్‌పాట్

17626 డెల్టా ఎక్స్‌ప్రెస్‌లో ఏర్పడిన సాంకేతిక, అంతర్గత సమస్యల నేపథ్యంలో S10, S11 స్లీపర్ కోచ్‌ల ప్రయాణికులను రైల్వే అధికారులు ఉచితంగా 3rd AC కోచ్‌కు అప్‌గ్రేడ్ చేశారు. ముందస్తు సమాచారం లేకుండానే ఈ ఏర్పాట్లు చేసినప్పటికీ, ప్రయాణంలో ఎలాంటి అంతరాయం లేకుండా సిబ్బంది సమర్థంగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి రోజున లభించిన ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు “జాక్‌పాట్”గా అభివర్ణిస్తున్నారు.


