News August 26, 2024

తెనాలిలో యువతీ ఫోటోలు మార్ఫింగ్

image

గుంటూరు (D) తెనాలికి చెందిన ఓ యువతి వైద్యరంగంలో స్పీచ్ అండ్ హియరింగ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. ఆమె ఫోటోలను కొందరు మార్ఫింగ్ చేసి వాటిని కొరియర్ ద్వారా ఆమెకు పంపి బెదిరించారు. బాధితురాలు తెనాలి 2టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ప్రకాశం (D) కంభం గ్రామానికి చెందిన అబ్దుల్ సత్తార్, మార్కాపురానికి చెందిన కరుణాకర్‌, గోరంట్లకు చెందిన భరత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News November 4, 2025

అమరావతికి రూ.32,500 కోట్ల అదనపు రుణాలు

image

అమరావతి రాజధాని నగరం అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ సహా ఆర్థిక సంస్థల నుంచి భారీగా రుణాలు అందనున్నాయి. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి ₹14,000 కోట్లు రుణం అందే అవకాశం ఉంది. దీనితో పాటు, నాబ్‌ఫిడ్ నుంచి ₹10,000 కోట్లు, నాబార్డు నుంచి ₹7,000 కోట్లు రానున్నాయి. ఈ కొత్త నిధులతో కలిపి, సీఆర్డీఏకు ₹58,500 కోట్లు అందుబాటులోకి రానున్నాయి. CRDA ఇప్పటికే ₹91,639 కోట్ల విలువైన 112 నిర్మాణ పనులను చేస్తోంది.

News November 4, 2025

గుంటూరు మిర్చీ యార్డులో 37,640 టిక్కీలు అమ్మకం

image

గుంటూరు మిర్చి యార్డుకు సోమవారం 40,415 మిర్చి టిక్కీలు విక్రయానికి వచ్చాయని మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక ఓ ప్రకటనలో తెలిపారు. ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 37,640 అమ్మకం జరిగినట్లు చెప్పారు. ఇంకా యార్డు ఆవరణలో 7,834 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు రకాలుగా నమోదయ్యాయన్నారు.

News November 4, 2025

తెనాలి: ప్రభుత్వ పథకాల పేరుతో వృద్ధురాళ్లకు టోకరా

image

ప్రభుత్వ పథకం కింద తక్కువ ధరకు టీవీ, ఫ్రిడ్జ్‌ వంటి వస్తువులు ఇస్తామని, తీసుకోకుంటే పథకాలు ఆగిపోయాయని తెనాలి వీఎస్సార్‌ కళాశాల రోడ్డులో నివసించే 60 ఏళ్ల బొద్దులూరి సీతామహాలక్ష్మికి, గంగానమ్మపేటకు చెందిన లింగమల్లు ఆమనికి గుర్తు తెలియని వ్యక్తులు టోకరా వేశారు. ఒకరి వద్ద రూ.40 వేలు, మరొకరి వద్ద రూ. 30 వేలు తీసుకుని పత్తాలేకుండా పోయారు. మోసపోయామని గ్రహించిన ఇద్దరూ తెనాలి టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు.