News March 3, 2025
తెనాలి: అలర్ట్..ఆ రైళ్ల నంబర్లు మారాయి

తెనాలి, నిడుబ్రోలు మీదుగా ప్రయాణించే 2 రైళ్లకు మార్చి 1 నుంచి నూతన నంబర్లు కేటాయించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు విశాఖపట్నం-కడప మధ్య ప్రయాణించే తిరుమల(డైలీ) ఎక్స్‌ప్రెస్‌లకు పాత నంబర్లు 17487/17488 స్థానంలో 18522/18521 నంబర్లు కేటాయించామన్నారు. ప్రయాణికులు రైలు నంబర్లలో మార్పును గమనించాలని కోరుతూ తాజాగా ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News March 4, 2025
ఆలపాటి రాజా తండ్రి నేపథ్యం ఇదే

ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ స్థాపకులు ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితులు. ఆయన తండ్రి శివరామకృష్ణ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయనకు ఎన్టీఆర్ అంటే ఇష్టంతో పార్టీ కోసం తన సొంత ఇంటిని, ఆయన పింఛన్లు కూడా పార్టీకి విరాళంగా ఇచ్చారని చెబుతారు. ఆయన కూడా తన తండ్రి బాటలో నడిచి టీడీపీలో అనేక హోదాలలో పనిచేశారు. ఆయన రాజకీయాలకు ముందు హైదరాబాదులో ఎన్టీఆర్, టీడీపీ కేసులన్నీ వాదించే టీంలో లాయర్‌గా పనిచేశారు.
News March 3, 2025
గుంటూరు: పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహించిన డిగ్రీ 1వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను తాత్కాలిక ఉపకులపతి ఆచార్య కె.గంగాధర్ అధికారికంగా సోమవారం ప్రకటించారు. మొత్తం 10,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 6,942 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్ సైట్ www.anu.ac.inలో చూడవచ్చు.
News March 3, 2025
GNT: అమ్మవారి అనుగ్రహం పేరిట మోసం

పూజల పేరిట డబ్బులు వసూలు చేసిన ఘటన GNTలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రాజేశ్వరరావు కాలనీకి చెందిన నాగేశ్వరరావుకు ఇంట్లో అమ్మవారి అనుగ్రహం ఉందని, పూజలు చేస్తే పైసలు వస్తాయని వెంకాయమ్మ అనే మహిళ నమ్మించింది. సిద్ధాంతితో ప్రాణగండం ఉందని చెప్పి భయపెట్టింది. పూజల కోసం విడతల వారీగా రూ. 15 లక్షలు తీసుకుంది. ఫలితం లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.