News December 21, 2024

తెనాలి: ఇస్రో ప్రయోగంతో అంతరిక్షంలోకి ఎన్ స్పెస్ టెక్ కమ్యూనికేషన్

image

తెనాలికి చెందిన రక్షణ ఎయిరోస్పేస్‌ సంస్థ ఎన్‌–స్పేస్‌టెక్‌ రూపొందించిన తొలి యూహెచ్‌ఎఫ్‌ కమ్యూనికేషన్‌ పేలోడ్‌ను ఇస్రోకు చెందిన పీఎస్‌ఎల్‌వీ–సీ60 మిషన్‌లో ప్రయోగించనున్నారు. స్వదేశీ సామర్థ్యంతో, ఉపగ్రహ కమ్యూనికేషన్‌లో వినూత్నతను ప్రతిబింబించే స్వేచ్ఛాశాట్‌–వీఓ మిషన్‌ పేరుతో చేపడుతున్న ఈప్రయోగం చివరి వారంలో ఇస్రో పొయెం-4 ప్లాట్‌ఫాం ద్వారా జరుగుతుందని ఎన్‌–స్పేస్‌టెక్‌ సీఈవో దివ్య కొత్తమాసు తెలిపారు.

Similar News

News October 26, 2025

GNT: రైతుల గుండెల్లో తుఫాన్ గుబులు..!

image

తుపాను హెచ్చరికలతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే అధిక వర్షాలతో డెల్టాలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు తుపాను ప్రభావంతో ఈదురు గాలులు, అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతల గుండెల్లో గుబులు మొదలైంది. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం వరి పైరు ఏపుగా పెరుగుతోంది. ఈ సమయంలో తుఫాను వస్తే పంట నీట మునిగి ఎందుకూ పనికి రాదని రైతులు భయపడుతున్నారు.

News October 26, 2025

తుపాన్ హెచ్చరికలు.. PGRS రద్దు: కలెక్టర్

image

మెంథా తుపాన్ దృష్ట్యా సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఏ.తమీమ్ అన్సారియా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇళ్ల వద్దనే ఉండాలన్నారు. ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.

News October 26, 2025

గుంటూరులో ప్రమాదం.. తెగిపడిన కాలు..!

image

పట్టాభిపురం పీఎస్ పరిధిలోని కృష్ణనగర్ కుందుల రోడ్డులో ప్రమాదం జరిగింది. కొరిటెపాడు ప్రాంతానికి చెందిన సురేష్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సురేష్‌కి తీవ్రగాయాలయ్యాయి. ఓ కాలు పూర్తిగా తెగిపోయింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారని స్థానికులు చెప్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.