News April 19, 2025
తెనాలి: ఉద్యోగాల పేరిట కోటిన్నర వసూలు.. ఘరానా మోసగాడు అరెస్ట్

ప్రభుత్వ ఉద్యోగాల పేరిట పలువురిని మోసం చేసిన కోటిన్నరకు పైగా వసూలు చేసి వ్యక్తిని త్రీటౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అమరావతి కాలనీకి చెందిన ఆరెమండ తేజ కృష్ణ కమల్ తాను ఏపీ సెక్రటేరియట్లో ఏఎస్ఓగా పని చేస్తున్నానంటూ ఫేక్ ఐడీలతో నమ్మించి ఉద్యోగాలు పేరిట భారీ మోసానికి పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.కోటిన్నర వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
Similar News
News April 20, 2025
బోధన్ డంపింగ్ యార్డ్ అగ్ని ప్రమాదంపై సబ్ కలెక్టర్ ఆరా

బోధన్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్‌లో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని బోధన్ సబ్-కలెక్టర్ వికాస్ మహతో పరిశీలించారు. మంటలను అదుపు చేసి, వీలైనంత త్వరగా ఆర్పడానికి తక్షణ అవసరమైన చర్యలు, అలాగే జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ కమిషనర్‌తో వెంకట నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
News April 20, 2025
నెల్లూరు: హెల్త్ ఆఫీసర్ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ

నెల్లూరు కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ చైతన్య ఆదివారం బుల్లెట్ వాహనంపై పర్యటించి పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించారు. ధనలక్ష్మిపురం, నారాయణ మెడికల్ కాలేజ్ రోడ్లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. మస్టర్లను పరిశీలించి శానిటేషన్ సెక్రటరీలకు సూచనలు చేశారు. కార్మికుల హాజరు శాతం తక్కువగా ఉండడంతో ఆదివారం కూడా పనికి వచ్చే కార్మికుల సంఖ్య తగ్గకుండా చూడాలని ఆదేశించారు.
News April 20, 2025
పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రి సీతక్క

ఉట్నూర్ మండలం దేవుగూడ ప్రభుత్వ గిరిజన టీడబ్ల్యూపీఎస్ పాఠశాలలో ఆదివారం రాష్ట్ర మంత్రి సీతక్క శిశు బెంచెస్ అందజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. అలాగే అన్ని పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్నారు. ఎంపీ నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా పాల్గొన్నారు.