News April 24, 2024
తెనాలి: టెన్త్ విద్యార్థికి 596 మార్కులు
తెనాలి పట్టణంలోని ఐతానగర్ ప్రాంతానికి చెందిన పాటిబండ్ల ప్రభాకర్ పదవ తరగతి పరీక్షలలో సత్తా చాటాడు. 600 మార్కులకు గానూ 596 మార్కులు సాధించి తెనాలిలో మొదటి స్థానంలో నిలిచాడు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాటిబండ్ల రామకృష్ణ, లక్ష్మీ తులసి, తోటి విద్యార్థులు ప్రభాకర్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
Similar News
News January 18, 2025
గుంటూరులో ముగ్గురికి జీవిత ఖైదు
గుంటూరు బార్ అసోసియేషన్ మహిళా న్యాయవాది హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలకు జీవిత ఖైదు విధించారు. లక్ష చొప్పున జరిమానా, బాధితురాలి పరిహారం కింద రూ.1,50,000 విధిస్తూ గుంటూరు 5వ అదనపు జడ్జి తీర్పు వెలువరించారు. గుంటూరు బ్రాడీపేటకు చెందిన న్యాయవాది రాచబత్తుని సీతా మహాలక్ష్మిని 2014లో సుబ్బారావు, శ్రీవాణి, మేరీజ్యోతి అనే ముగ్గురు కలిసి హత్య చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారు.
News January 18, 2025
BREAKING: బస్సులు ఢీ.. గుంటూరు వాసులు మృతి
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు గుంటూరు నుంచి HYD వెళ్తుండగా SV కళాశాల సమీపంలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో క్లినర్ బస్సు అద్దంలో నుంచి ఎగిరిపడగా.. అతడి పైనుంచి బస్సు వెళ్లడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. గుండెపోటుతో ప్రయాణికుడు మృతిచెందాడు. మృతిచెందిన వారు గుంటూరు వాసులు సాయి, రసూల్‌గా పోలీసులు గుర్తించారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 18, 2025
అన్ని ప్రాంతాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు: కలెక్టర్
పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని గుంటూరు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ ఆదేశించారు. శుక్రవారం, కలెక్టరేట్ నుంచి ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్’ కార్యక్రమంపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశం నిర్వహించారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతి నెల 3శనివారం ఈ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుందని కలెక్టర్ చెప్పారు.