News April 4, 2024
తెనాలి: నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి

నీటి తొట్టెలో పడి మూడేళ్ల పాప మృతి చెందిన ఘటన తెనాలి యడ్లలింగయ్య కాలనీ శివారు పొలాల వద్ద జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ కుటుంబానికి చెందిన చిన్నారి మంగళవారం సాయంత్రం ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ నీటి తొట్టెలో పడిందని, ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురాగా అప్పటికే పాప మృతి చెందిందని వైద్యులు చెప్పినట్లు సమాచారం.
Similar News
News October 24, 2025
సైబర్ నేరాలు, మోసాలపై అవగాహన కల్పించాలి: ఎస్పీ

ప్రజలకు సైబర్ నేరాలు, మోసాల పట్ల అవగాహన కల్పించాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రామ/ వార్డు మహిళా పోలీసులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా పోలీసులు తమ పరిధిలోని ప్రజలతో మమేకమై సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. అనంతరం సైబర్ భద్రతా పోస్టర్లు, అవగాహన బ్రోచర్లను ఆయన విడుదల చేశారు.
News October 23, 2025
గుంటూరులో పురాతన అగస్త్యేశ్వరస్వామి ఆలయం

గుంటూరు RTC బస్ స్టాండ్కు సమీపంలో అగస్త్యేశ్వరస్వామి ఆలయం అత్యంత పురాతనమైనది. చాళుక్యుల సామంతులైన పరిచ్ఛేద వంశానికి చెందిన పండయ్యరాజు దీనిని 12వ శతాబ్దంలో నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఈ శివలింగాన్ని వేలాది సంవత్సరాల క్రితం అగస్త్య మహర్షి ప్రతిష్టించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ చతురస్రాకారంలో శివలింగం దర్శనమిస్తుంది. ఆలయ ముఖ మండప స్తంభాలు చాళుక్యుల శిల్పకళా వైభవానికి నిదర్శనం.
News October 23, 2025
గుంటూరులో ట్రాఫిక్ నిర్వహణపై ఎస్పీ ఆకస్మిక పర్యటన

గుంటూరు నగరంలో ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ పనితీరును ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. పట్టాభిపురం, బ్రాడీపేట, కొత్తపేట, బస్టాండ్ సెంటర్, తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.