News March 8, 2025
తెనాలి నుంచి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి వరకు

గురిజాల రాధారాణి 29 జూన్ 1963లో తెనాలిలో జన్మించింది. ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీలో లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, అనంతరం ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ పూర్తి చేసింది. 1989లో న్యాయవాద వృత్తిలో ప్రవేశించి హైదరాబాద్‌లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా చేశారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికైంది. 2021 అక్టోబరు 13న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై పని చేస్తున్నారు.
Similar News
News December 5, 2025
పారిశ్రామికవేత్తల దరఖాస్తులు పరిష్కరించాలి: కలెక్టర్

వివిధ పథకాలు క్రింద మంజూరైన యూనిట్లు త్వరగా ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం శుక్రవారం కలెక్టరేట్ లో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు చేసుకున్న దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలన్నారు. ఎపిఐఐసి భూములకు సంబంధించిన దస్త్రాలు త్వరగా పరిష్కరించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News December 5, 2025
ANU: LLB 5 సంవత్సరాల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత ఏప్రిల్ నెలల్లో జరిగిన BA LLB 5 సంవత్సరాల ఫస్ట్ సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలను వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు యూనివర్సిటీలోని సంబంధిత కార్యాలయంలోని అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
News December 5, 2025
GNT: ఒక్క రోజు మీకు ఇస్తే.. మీ ప్రాధాన్యత ఏంటి.?

గుంటూరు జిల్లాను పట్టిపీడిస్తున్న సమస్యలెన్నో. గుంతల రోడ్లు, పొంగే డ్రైనేజీలు, తాగునీటి కష్టాలు, ట్రాఫిక్ నరకం.. జనం నిత్యం అవస్థలు పడుతున్నారు. మరి మీకు ఒక్కరోజు సమస్య పరిష్కరించే అధికారం దక్కితే.. వీటిలో ఏ సమస్యను అత్యవసరంగా పరిష్కరిస్తారు? మీ ప్రాధాన్యత ఏంటి? రోడ్లా? నీళ్లా? డ్రైనేజీనా? మీ మనసులో మాట చెప్పండి! ఈ ఒక్కరోజు ఛాన్స్ మీకైతే.. పట్టణ రూపురేఖలు ఎలా మారుస్తారు? కామెంట్ చేయండి.


