News March 8, 2025

తెనాలి: మూడు సార్లు ఎమ్మెల్యే అయిన మహిళ

image

దొడ్డపనేని ఇందిర మాజీ మంత్రి ఆలపాటి వెంకటరామయ్య, సామ్రాజ్యమ్మల కుమార్తె. ఈమె 1937 జనవరి 7న తెనాలి సమీపంలో యడ్లపల్లి గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత చెన్నై బిఎస్సి(హోం సైన్స్) లో డిగ్రీ తీసుకున్నారు. తెనాలి నుంచి మూడు సార్లు(1967, 1972, 1978) ఎమ్మెల్యేగా గెలిచారు. 1987లో గుంటూరు జిల్లా పరిషత్‌కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈమె పేరుతో తెనాలిలో పాఠశాల ఏర్పాటు చేశారు.

Similar News

News October 16, 2025

అమరావతి: 40 ఎకరాల భూమి ఇచ్చేందుకు రైతుల అంగీకారం

image

అమరావతి భూ సమీకరణకు రైతులు స్వచ్ఛందంగా 40.25 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. కమిషనర్ కె. కన్నబాబు చర్చలు ఫలించాయి. ఉండవల్లిలో అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు, కొండవీటి వాగు, ఇతర రోడ్ల నిర్మాణ పనుల కోసం 22 మంది రైతులు 12 ఎకరాల భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇచ్చారు. పెనుమాకలో 14 మంది రైతులు 28.25 ఎకరాల భూమి ఇచ్చేందుకు అంగీకరించారు.

News October 16, 2025

గుంటూరు మిర్చి యార్డులో ధరలు..

image

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం లక్ష క్వింటాళ్ల AC సరుకు అమ్మకానికి వచ్చింది. రకం, నాణ్యతను బట్టి క్వింటాలుకు ధరలు ఇలా ఉన్నాయి. తేజా, 355, 2043 రకాలు: కేజీ ₹100 నుంచి ₹160 వరకు పలికాయి. యల్లో రకం: అత్యధికంగా కేజీ ₹200 నుంచి ₹230 వరకు పలికింది. నెంబర్ 5, DD రకాలు: కేజీ ₹110 – ₹155 మధ్య ఉన్నాయి. మీడియం సీడ్ రకాలు ₹80 – ₹100, బుల్లెట్ రకాలు ₹90 – ₹145 మధ్య ట్రేడ్ అయ్యాయి.

News October 16, 2025

దుగ్గిరాల వైసీపీ జెడ్పీటీసీ భర్త అరెస్ట్ ?

image

దుగ్గిరాల మండలం వైసీపీ జడ్పీటీసీ మేకతోటి అరుణ భర్త వీరయ్యను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆయన భార్య అరుణ ఆరోపించారు. తాడేపల్లి పరిధి కుంచనపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న తన భర్తను అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేశారని అన్నారు. తాడేపల్లి స్టేషన్‌కు తరలిస్తున్నామని చెప్పారని.. కానీ తన భర్త అక్కడ లేదని అరుణ ఆరోపించారు. ఈ మేరకు తన భర్త ఆచూకీ చెప్పాలని తాడేపల్లి ఠాణాలో గురువారం ఫిర్యాదు చేశారు.