News March 8, 2025
తెనాలి: మూడు సార్లు ఎమ్మెల్యే అయిన మహిళ

దొడ్డపనేని ఇందిర మాజీ మంత్రి ఆలపాటి వెంకటరామయ్య, సామ్రాజ్యమ్మల కుమార్తె. ఈమె 1937 జనవరి 7న తెనాలి సమీపంలో యడ్లపల్లి గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత చెన్నై బిఎస్సి(హోం సైన్స్) లో డిగ్రీ తీసుకున్నారు. తెనాలి నుంచి మూడు సార్లు(1967, 1972, 1978) ఎమ్మెల్యేగా గెలిచారు. 1987లో గుంటూరు జిల్లా పరిషత్‌కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈమె పేరుతో తెనాలిలో పాఠశాల ఏర్పాటు చేశారు.
Similar News
News February 14, 2026
కోటప్పకొండ తిరునాళ్లకు 650 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. నెల్లూరు జోన్ ఈడీ నాగేంద్రప్రసాద్ తెలిపిన ప్రకారం కృష్ణా, గుంటూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి మొత్తం 650 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. నరసరావుపేట, చిలకలూరిపేట నుంచి నిమిషానికో సర్వీసు అందుబాటులో ఉంటుంది. కొండపైకి రాకపోకలకు 60 సప్తగిరి బస్సులు ఏర్పాటు చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతుందన్నారు.
News February 14, 2026
GNT: శివరాత్రి రద్దీకి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రి సందర్భంగా గోవాడ, క్వారీ తిరునాళ్లకు భక్తుల రాకపోకలు సులభంగా ఉండేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సుమారు 50 బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచే నిరంతర సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రద్దీని బట్టి బస్సుల సంఖ్య పెంచుతామని చెప్పారు. తెనాలి మార్కెట్, ఓవర్‌బ్రిడ్జి వద్ద ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. టిక్కెట్ ధరలు యథాతథంగా ఉంటాయి.
News February 14, 2026
రాజ్యసభ భరిలో రాజధాని జిల్లా నేతలు.?

AP నుంచి రాజ్యసభలో 4 స్థానాలు ఖాళీ అవుతుండగా NDA కూటమికి ఆ స్థానాలన్నీ దక్కుతాయన్న వార్తలతో రాజధాని గుంటూరు జిల్లా నేతలు రాజ్యసభ సీటు కోసం పావులు కదుపుతున్నారు. వీరిలో భాష్యం రామకృష్ణ పేరు బలంగా వినిపిస్తుండగా గళ్లా జయదేవ్, కిలారు రాజేశ్, లింగమనేని రమేశ్ రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరి రాజ్యసభ సీటు ఎవరికి వస్తుందో కామెంట్ చేయండి.


