News April 5, 2025

తెనాలి రైలు ప్రయాణంలో యువకుడి మృతి

image

కోయంబత్తూరు నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్న రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్‌లో యువకుడి మృతి చెందాడు. శుక్రవారం బాపట్ల దగ్గర ఆయన కదలకపోవడంతో అనుమానం వచ్చిన తోటి ప్రయాణికులు టీసీకి తెలియజేశారు. సమాచారం మేరకు రైలు తెనాలిలో ఆపి అతన్ని కిందకు దించి వైద్య సాయాన్ని అందించగా అప్పటికే మృతిచెందినట్టు తేలింది. 23-25 ఏళ్ల మధ్య వయసున్న అతడి గుర్తింపు తెలియాల్సి ఉంది. జీఆర్పీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

Similar News

News April 7, 2025

గుంటూరు: కుక్కల దాడిలో చిన్నారి మృతి.. ఎమ్మెల్యే దిగ్భ్రాంతి

image

స్వర్ణభారతీనగర్‌లో కుక్కల దాడిలో చిన్నారి మృతిచెందిన ఘటనపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా కుక్కల సమస్యపై గళమెత్తినా అధికారులు తాత్కాలికంగా చర్యలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి ఐజక్ ఆత్మకు శాంతి చేకూరాలని, అధికారులు ఇప్పటికైనా కుక్కల నియంత్రణ పై దృష్టి సారించాలని అన్నారు.

News April 7, 2025

GNT: శునకం దాడిలో చిన్నారి మృతిపై మంత్రి దుర్గేశ్ విచారం

image

గుంటూరులోని స్వర్ణభారతినగర్‌లో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటనపై మంత్రి కందుల దుర్గేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన, బాలుడి కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. ఇలాంటి విషాద ఘటనలు మళ్లీ జరుగకుండా కుక్కల నియంత్రణపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News April 6, 2025

తెనాలి: పోలీసుల అదుపులో రౌడీ షీటర్ లడ్డు

image

తెనాలి ఐతానగర్ చెందిన రౌడీషీటర్ లడ్డు మరోసారి పోలీసులకు చిక్కాడు. పలు నేరాల్లో భాగంగా ఇటీవల పీడి యాక్ట్ నమోదై జైలుకు వెళ్లి వచ్చిన లడ్డు తాజాగా మరో కేసులో ఇరుక్కున్నాడు. కోపల్లెకి చెందిన మహిళపై దాడి చేసిన ఘటనలో బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి లడ్డును అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ లిఫ్ట్ చేయలేదన్న కారణంతో మహిళపై లడ్డు రాడ్డుతో దాడి చేసినట్లు అభియోగాలు ఉన్నాయి.

error: Content is protected !!