News March 6, 2025

తెనాలి: వేరువేరు ఘటనల్లో ఇద్దరు మృతి 

image

తెనాలి రైల్వేస్టేషన్లో బుధవారం సుమారు 60 ఏళ్ల మహిళ ప్లాట్‌ఫారం చివర పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొట్టడంతో మరణించింది. ఆమె వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన మహిళగా పోలీసులు భావిస్తున్నారు. మరో ఘటనలో తిరుమల ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సుమారు 50ఏళ్ల వ్యక్తి తెనాలి శివారు యడ్ల లింగయ్య కాలనీ రైల్వే గేటు సమీపంలో రైలు నుంచి జారిపడి మృతిచెందాడు. జీఆర్పీ పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

Similar News

News January 12, 2026

PGRS ఫిర్యాదులు పునరావృతం కాకూడదు: SP

image

ప్రజా సమస్యలను చట్టబద్ధంగా, వేగంగా పరిష్కరించాలని ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికారులతో కలిసి ప్రజల సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులు తిరిగి పునరావృతం కాకుండా సంబంధిత స్టేషన్‌ల అధికారులు పరిష్కరించాలని చెప్పారు.

News January 12, 2026

GNT: సెలవుల్లో ఊరెళ్లే వారికి SP సూచన

image

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఊర్లకు వెళ్లే ప్రజలు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (LHMS)ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. ఉచితంగా అందించే ఈ సేవల ద్వారా ఇళ్ల ముందు తమ సిబ్బంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపడతారని చెప్పారు. ప్రజలు ఊర్ల నుంచి వచ్చే వరకు గస్తీ నిర్వహిస్తారని అన్నారు. సీసీ కెమెరాల ద్వారా అనుమానిత వ్యక్తుల కదలికలు రికార్డ్ అవుతాయని పేర్కొన్నారు.

News January 12, 2026

తెనాలి సబ్ కలెక్టర్‌కు పదోన్నతి.. బదిలీ..!

image

తెనాలి సబ్ కలెక్టర్ V.సంజనా సింహ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ కే విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా తెనాలి సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సంజన సింహ పల్నాడు జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా పదోన్నతి పొంది తెనాలి నుంచి బదిలీ అయ్యారు. ఐతే తెనాలి సబ్ కలెక్టర్ లేదా రెవెన్యూ డివిజన్ అధికారిగా ఎవరిని నియమిస్తారన్నది తెలియాల్సి ఉంది.