News August 12, 2024

తెనాలి: శరవేగంగా క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ నిర్మాణం

image

డెల్టా ప్రాంత ప్రజలకు వరమైన తెనాలిలో వైద్యశాల్లో మరో నూతన విభాగం అందుబాటులోకి రానుంది. అత్యవసర కేసులను గుంటూరు జిల్లా వైద్యశాలకు తరలిస్తున్న నేపథ్యంలో తెనాలిలోనే ఆ స్థాయిలో వైద్యం అందించేందుకు కసరత్తు జరుగుతోంది. రూ.45కోట్ల అంచనాతో 100 పడకలతో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ నిర్మాణం ప్రారంభమైంది. మొత్తంగా 2025 చివరి నాటికి క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Similar News

News November 20, 2025

చేపలకోసం వల వేస్తే.. చిక్కిన కొండచిలువ

image

చేపల కోసం ఓ జాలరి వేసిన వలలో చేపలకు బదులు కొండచిలువ పడిన ఘటన తాడేపల్లిలో చోటుచేసుకుంది. రైల్వే బ్రిడ్జి పంప్ హౌస్ వద్ద బకింగ్ కెనాల్ కాలువలో గురువారం ఓ జాలరి చేపలు పట్టేందుకు కృష్ణా నదిలోకి వల వేయగా కొద్దిసేపటికి వల బరువుగా తగిలింది. దీంతో చేపలు బాగా పడ్డాయి అనుకుంటూ వలనిపైకి తీసి చూడగా అందులో ఉన్న కొండచిలువను చూసి ఒక్కసారిగా అవాకయ్యాడు. తాను ఎప్పుడూ ఇలా పాము రావడం చూడలేదని జాలరి చెప్పాడు.

News November 20, 2025

ANU: ‘మాస్ కాపీయింగ్‌కి సహకరిస్తే గుర్తింపు రద్దు’

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో గుంటూరు, పల్నాడు జిల్లాలోని కొన్ని కాలేజీలలో మంగళవారం నుంచి జరుగుతున్న PG, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరుగుతుందన్న ప్రచారంపై గురువారం యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు స్పందించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నమన్నారు. మాస్ కాపీయింగ్‌కి సహకరిస్తే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామన్నారు.

News November 20, 2025

ధాన్యం ఆఖరి గింజ వరకూ కొంటాం: మంత్రి నాదెండ్ల

image

జిల్లాలోనే తొలిగా కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్ర గురువారం ప్రారంభమైంది. రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియాతో పాటు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులతో ఆయన మాట్లాడారు. రైతులు ధైర్యంగా ఉండాలని మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు.